Saloon in Space: స్పేస్‌ స్టేషన్‌లో కటింగ్‌ వేయించుకున్న మాథియాస్‌ మౌరర్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Saloon in Space: స్పేస్‌ స్టేషన్‌లో కటింగ్‌ వేయించుకున్న మాథియాస్‌ మౌరర్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 07, 2022 | 8:43 AM

స్పేస్ స్టేషన్‎లోకి వెళ్లడమే ఓ గొప్ప అనుభూతిగా ఉంటుంది. కానీ ఓ వ్యక్తి స్పేస్ స్టేషన్‎లో ఏకంగా హెయిర్‌ కటింగ్ వేయించుకున్నారు. అతనెవరో కాదు.. వ్యోమగామి మాథియాస్ మౌరర్. అతను హెయిర్‌ కట్‌ చేయించుకుంటున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


స్పేస్ స్టేషన్‎లోకి వెళ్లడమే ఓ గొప్ప అనుభూతిగా ఉంటుంది. కానీ ఓ వ్యక్తి స్పేస్ స్టేషన్‎లో ఏకంగా హెయిర్‌ కటింగ్ వేయించుకున్నారు. అతనెవరో కాదు.. వ్యోమగామి మాథియాస్ మౌరర్. అతను హెయిర్‌ కట్‌ చేయించుకుంటున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. తనకు స్పేస్ స్టేషన్‌లో క్రూమేట్ రాజా చారి హెయిర్‌కటింగ్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో మౌరర్ జుట్టును ట్రిమ్మర్‌తో రాజా చారి కత్తిరించారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్త్‌ చేస్తూ…చారి చాలా ప్రతిభ ఉన్న వ్యక్తి అంటూ క్యాప్షన్‌ పెట్టారు. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న ఈ వీడియోను డిసెంబర్ 19న షేర్ చేసారు. ఈ వీడియో చూసిన వేలమంది నెటిజన్లు ఫిదా అయిపోయారు. రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. భూమిపైన నిర్వహించే అనేక పనులు అంతరిక్షంలో చేయడం కష్టమే అని కొందరు… “NASA’s స్పేస్ సెలూన్” అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

Published on: Jan 07, 2022 08:39 AM