Chemical tanker: కెమికల్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్.. ఆరుగురు మృతి.. 25 మందికి తీవ్ర అస్వస్థత

Chemical tanker: గుజరాత్ లో విషాదం నెలకొంది. కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువులు లీకై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సూరత్​లోని సచిన్​ జీఐడీసీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున..

Chemical tanker: కెమికల్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్.. ఆరుగురు మృతి.. 25 మందికి తీవ్ర అస్వస్థత
Chemical Tanker Leaks In Su
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2022 | 12:57 PM

Chemical tanker: గుజరాత్ లో విషాదం నెలకొంది. కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువులు లీకై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సూరత్​లోని సచిన్​ జీఐడీసీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ విషవాయువులు పీల్చడంతో మరో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే..

సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్‌ లీక్‌ అయ్యింది. ట్యాంకర్ కు 10 మీటర్ల దూరంలో ఉన్న విశ్వప్రేమ్​ మిల్​లో కార్మికులు విషవాయుని పీల్చడంతో క్షణాల్లో స్పృహ కోల్పోయారు.  ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. సుమారు 25మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మిల్లులో కాస్త దూరంగా ఉన్నవాళ్లు ఆస్పత్రికి ఫోన్ చేశారు. బాధిత ప్రజలను చికిత్స నిమిత్తం సూరత్ సివిల్ ఆసుపత్రిలో చేర్పించారు.

సచిన్ GIDC ఒక పారిశ్రామిక ప్రాంతం. లీకైన ట్యాంకర్‌ను జెర్రీ కెమికల్‌తో నింపినట్లు సమాచారం. ట్యాంకర్ డ్రైవర్ వ్యర్థాలను డ్రెయిన్‌లో వేయడానికి ప్రయత్నించగా, ఆ రసాయనం గాలికి తాకడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.  డ్రైవర్ అక్రమంగా రసాయన వ్యర్థాలను సచిన్ జిఐడిసి ప్రాంతంలోని డ్రైన్‌లో వేయడానికి ప్రయత్నిస్తున్నాడని  తెలుస్తోంది. మరణించిన , బాధిత కార్మికులు సచిన్ GIDC ప్రాంతంలోని అద్దకం కర్మాగారంలో పనిచేస్తున్నట్లు సమాచారం. బాధితుల్లో కొందరు సమీపంలోని దుకాణంలో టీ తాగుతున్నట్లు సమాచారం.

కెమికల్ లీక్ ఘటన జరిగినప్పుడు కార్మికులు డైయింగ్ ఫ్యాక్టరీలో ఉన్నారని  పరీక్ తెలిపారు. విషపూరిత పొగలు పీల్చి 25 నుంచి 26 మంది కార్మికులు స్పృహతప్పి పడిపోయారని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ చెప్పారు. తాజా పరిస్థితిని అదుపు చేసేందుకు అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది.  గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ట్యాంకర్ వాల్వ్‌ను మూసివేసింది. గ్యాస్‌ లీక్‌ కావడంతో ట్యాంకర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్యాంకర్ డ్రైవర్‌, యజమానిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Also Read:

చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. దేశంలో మొత్తం కేసులు ఎన్నంటే..?

సంక్రాంతి స్పెషల్.. సాంప్రదాయ ముగ్గులు, డిజైన్స్ ఐడియాలు మీకోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే