Omicron Cases: చాపకింద నీరులా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. దేశంలో మొత్తం కేసులు ఎన్నంటే..?
India Omicron Cases: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.
India Omicron Cases: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. భారత్‌లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,630కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 797 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 465, రాజస్థాన్‌లో 236, కేరళలో 234, కర్ణాటకలో 226, గుజరాత్‌లో 204, తమిళనాడులో 121 కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో 94 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా.. ఆంధ్రప్రదేశ్‌లో 28 కేసులు నమోదయ్యాయి.
డిసెంబరు 21నాటికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 200. ఇది జనవరి 1 నాటికి 1,431కి చేరగా.. జనవరి 6నాటికి ఇది 2,630కి పెరిగాయి.
జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగలాండ్, మిజోరాం, త్రిపురలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదుకాలేదు.
అధికారిక సమాచారం మేరకు దేశంలో ఇప్పటి వరకు 995 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.
భారీగా పెరిగిన కోవిడ్ కేసులు.. అటు కోవిడ్ కేసుల సంఖ్య దేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారంనాడు విడుదల చేసిన వివరాల మేరకు దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 90,928గా ఉంది. 325 మందిని కోవిడ్ మహమ్మారి బలితీసుకుంది. నిన్నటితో పోల్చితే రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 56శాతం పెరిగాయి.
డిసెంబరు 27 నాడు దేశంలో 6,531 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. జనవరి 1న 22,775గా ఉంది. జనవరి 5న దేశంలో 58,097 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకాగా.. జనవరి 6న కేసుల సంఖ్య 90,928కు చేరింది.
Also Read..
PM Security Breach: ప్రధాని మోడీ భద్రత వైఫల్యానికి బాధ్యులు ఎవరు..? సుప్రీంలో పిటీషన్..
Coronavirus: ఒమిక్రాన్ సాధారణ జలుబు అనుకుంటే పొరబడినట్టే.. హెచ్చరిస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..