Coronavirus: ఒమిక్రాన్‌ సాధారణ జలుబు అనుకుంటే పొరబడినట్టే.. హెచ్చరిస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..

Coronavirus: కరోనా మహమ్మారి ఇప్పట్లో మానవ జాతిని వదిలేలా కనిపించడం లేదు. ఏడాదికో రూపం మార్చుకుంటూ ప్రపంచంపై దండెత్తుతోంది. సెకండ్‌ తర్వాత కేసులు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా...

Coronavirus: ఒమిక్రాన్‌ సాధారణ జలుబు అనుకుంటే పొరబడినట్టే.. హెచ్చరిస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 06, 2022 | 12:20 PM

Coronavirus: కరోనా మహమ్మారి ఇప్పట్లో మానవ జాతిని వదిలేలా కనిపించడం లేదు. ఏడాదికో రూపం మార్చుకుంటూ ప్రపంచంపై దండెత్తుతోంది. సెకండ్‌ తర్వాత కేసులు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా ఒమిక్రాన్‌ రూపంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ప్రపంచంపై సునామీలా విరుచుకుపడుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో ఒక్క రోజులోనే ఏకంగా 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఇక భారత్‌లో కూడా కేసులు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. రోజువారీ కేసులు సంఖ్య లక్షకు చేరువుతోంది. ఇదిలా ఉంటే డేల్టా వేరియెంట్‌తో పోలిస్తే.. ఒమిక్రాన్‌ అంత ప్రమాదకరం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒమిక్రాన్‌తో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కథనాలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఒమిక్రాన్‌ను సాధారణ వ్యాధిలా పరిగణించడం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ విషయమైన డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్‌ లీడ్‌ మరియా వాన్‌ కేర్ఖోవ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్‌ వ్యాధి తీవ్రత తక్కువైనప్పటికీ.. తేలికపాటి వ్యాధి కాదని తెలిపారు.. ఒమిక్రాన్‌ సాధారణ జలుబు లాంటిదని చెప్పడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు ఈ వేరియంట్‌ బారిన పడితే పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపినా కేర్ఖోవ్‌.. ఆసుపత్రులు నిండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొత్తం మీద ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఏ మాత్రం లైట్‌ తీసుకోకూడదని, అది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి మరీ చెబుతోంది.

Also Read: Aha: ఆహాలో సరికొత్త వినోదం.. జనవరిలో అలరించనున్న షోస్.. సినిమాలు ఇవే..

10. 11సార్లు కరోనా టీకా వేసుకున్నానోచ్‌!(Video)

Actress: స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకిన నటి.. అంతలోనే ఆస్పత్రి బెడ్‌పై ట్రీట్‌మెంట్.. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ