Aha: ఆహాలో సరికొత్త వినోదం.. జనవరిలో అలరించనున్న షోస్.. సినిమాలు ఇవే..

ప్రతి వారం సరికొత్త కంటెంట్‏ను అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఓటీటీ మాధ్యమం ఆహా. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్,

Aha: ఆహాలో సరికొత్త వినోదం.. జనవరిలో అలరించనున్న షోస్.. సినిమాలు ఇవే..
Aha Ott
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2022 | 10:48 AM

ప్రతి వారం సరికొత్త కంటెంట్‏ను అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఓటీటీ మాధ్యమం ఆహా. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్, అదిరిపోయే టాక్ షోస్, ఎక్సయిటెడ్ గేమ్ షోస్, సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది తొలి తెలుగు ఓటీటీ మాద్యమం ఆహా.. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా.. ఇతర భాషలలోని సూపర్ హిట్ చిత్రాలను విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇతర ఓటీటీ సంస్థలకు గట్టిపోటినిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ఆహా. సినిమాలే కాకుండా.. నందమూరి హీరో బాలకృష్ణతో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో నిర్వహిస్తూ అదరగొట్టింది. ఇక ఇటీవల ఆహాలో వచ్చిన సేనాపతి సినిమాతో సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక జనవరి నెలలో మరోసారి సరికొత్త కంటెంట్‏ను తీసుకురాబోతుంది ఆహా. మరీ ఈనెలలో ప్రేక్షకులను అలరించనున్న సినిమాలు, షోస్ ఏంటో తెలుసుకుందామా.

చెఫ్ మంత్ర.. బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరైన శ్రీముఖి వ్యాఖ్యతగా కొనసాగుతున్న షో చెఫ్ మంత్ర. ఈ ఫుడ్ షోకు ప్రియాంక ముఖ్య అతిథిగా సందడి చేసంది.. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జనవరి 5న స్ట్రీమింగ్ జరిగింది.

సర్కార్ గేమ్ షో.. యాంకర్ ప్రదీప్ మాచిరాజు నిర్వహిస్తోన్న సర్కార్ గేమ్ షోలోకి ఈరోజు (జనవరి6న) పంచతంత్రం టీమ్ రాబోతుంది. ఈ క్రమంలో దివ్య ద్రిష్టి, శివాత్మిక, రాహుల్ విజయ్, హర్ష పులిపాక అతిథులుగా రానున్నారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కానుంది.

లక్ష్య మూవీ.. యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం లక్ష్య. ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా.. జగపతిబాబు, సత్య శ్రీను, రవి ప్రకాష్, సచిన్ కేడ్కర్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ఆహాలో జనవరి 7న స్ట్రీమింగ్ కానుంది.

సర్కార్ గేమ్ షో సర్కార్ గేమ్ షోలో గెటప్ శ్రీన్, ధనరాజ్, వేణు, అవినాష్ సందడి చేయనున్నారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ జనవరి 13న స్ట్రీమింగ్ కానుంది.

ది అమెరికన్ డ్రీమ్.. అలాగే ది అమెరికన్ డ్రీమ్ చిత్రాన్ని ఆహా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రిన్స్, నేహా క్రిష్ణ, డా. విఘ్నేష్ కౌశిక్, రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే.. నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా ప్రసారమవుతున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలోకి లైగర్ టీం సందడి చేయనుంది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీలు పాల్గోన్న ఎపిసోడ్ జనవరి 14న టెలికాస్ట్ కానుంది.

అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే.. ఇక ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. బాలయ్యతో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేసిన అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎపిసోడ్ జనవరి 21న స్ట్రీమింగ్ కానుంది.

Also Read: Naa Peru Shiva 2: మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్న కార్తీ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు” నాపేరు శివ 2″

Gali Janardhan Reddy Son: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి​ కొడుకు.. దర్శకుడు ఎవరంటే..

Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!