AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..

దగ్గుబాటి యంగ్ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లానాయక్ సినిమాలో నటిస్తున్నాడు రానా.

Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..
Rana
Rajeev Rayala
|

Updated on: Jan 05, 2022 | 6:51 PM

Share

Rana Daggubati : దగ్గుబాటి యంగ్ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లానాయక్ సినిమాలో నటిస్తున్నాడు రానా. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం కు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రానా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తో పాటు వేణు ఉడుగుల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. విరాట పర్వం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే ‘1945’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రానా మరో సినిమాను లైన్ లో పెట్టాడని తెలుస్తుంది.

తమిళ్‌లో సూపర్ హిట్ అయిన సినిమాను ఇప్పుడు రానా రీమేక్ చేయబోతున్నాడని తెలుస్తుంది. హీరో శింబు నటించిన మన్నాడు సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ అవ్వనుందని తెలుస్తుంది. ఎస్.ఎస్.ఐ. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు. తమిళంలో పోయిన ఏడాది నవంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్ డ్రామాను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. హీరోకి .. విలన్ కి మధ్య మైండ్ గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈ సినిమాను ముందుగా తెలుగులో కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా కేవలం తమిళ్ లోనే రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను రానా రీమేక్ చేయనున్నాడని అంటున్నారు. తెలుగు హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ వారి దగ్గర ఉన్నాయట. రానాతో రీమేక్ చేయాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!

Megastar Chiranjeevi: సేనాపతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రాజేంద్రప్రసాద్ నటనపై ఆసక్తికర కామెంట్స్..

Pushpa: ఇట్స్ అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

Follow Us
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
ట్విస్ట్ ఇచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రివర్స్
ట్విస్ట్ ఇచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రివర్స్
కోపంతో తిరగబడిన నాగుపామును ఎప్పుడైనా చూశారా..?
కోపంతో తిరగబడిన నాగుపామును ఎప్పుడైనా చూశారా..?
మటన్ Vs చికెన్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తప్పనిసరిగా..
మటన్ Vs చికెన్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తప్పనిసరిగా..