Actress: స్విమ్మింగ్ పూల్‌లోకి దూకిన నటి.. అంతలోనే ఆస్పత్రి బెడ్‌పై ట్రీట్‌మెంట్.. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే..
Actress: స్విమ్మింగ్ కోసం పూల్ లోకి దూకి మరణం అంచులదాకా వెళ్లొచ్చింది ఒక నటి. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి నాలా మీరెవరూ చేయొద్దు..
Actress: స్విమ్మింగ్ కోసం పూల్ లోకి దూకి మరణం అంచులదాకా వెళ్లొచ్చింది ఒక నటి. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి నాలా మీరెవరూ చేయొద్దు.. అందరూ హ్యాపీగా ఉండండి అంటూ సూచిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన నటి, సింగర్ మోడల్ అయిన అలీ సింప్సన్ నూతన సంవత్సరంలో తనకు జరిగిన చేదు అనుభవాన్ని తన అభిమానులతో పంచుకుంది. తన న్యూఇయర్.. కరోనా పాజిటివ్‌తో, విరిగిన మెడతో ప్రారంభమైందని చెప్పుకొచ్చింది. తాను స్విమ్మింగ్ పూల్‌లోకి దూకగానే తన తల నేలకు బలంగా తగిలి ఫ్రాక్చర్ అయిందని, వెంటనే తనను ఆస్పత్రికి తరలించగా.. పలు టెస్టులు నిర్వహించిన డాక్టర్లు పెద్ద ప్రమాదమేమీ లేదనీ 4 నెలలు విశ్రాంతి తీసుకోమన్నారని తెలిపింది.
అయితే ప్రమాదంలో తన వెన్నుపూసకు ఏమీ కాకపోవడం చాలా సంతోషమని, పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడటం అదృష్టంగా భావిస్తున్నానని సింప్సన్ పేర్కొంది. తాను ఆస్పత్రిపాలైన ఫొటోను అలీ సింప్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా తనకు వైద్యం చేసిన డాక్టర్లకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ.. నాలా కాకుండా మీరందరూ గొప్పగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. లోతు తెలియకుండా దేనిలోనూ దూకకండి’ అని సూచించింది అలీ.
View this post on Instagram
Also Read:
India Corona Cases: జెట్ స్పీడ్‌తో కోరలు చాస్తున్న కరోనా.. 24 గంటల్లో 55 శాతంకు పైగా కేసులు..