Grammy Awards: కరోనా ఎఫెక్ట్.. గ్రామీ అవార్డుల వేడుక వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
Grammy Awards: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జనవరి 31న జరగాల్సిన 64వ గ్రామీ అవార్డుల ఈవెంట్ వాయిదా పడింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్
Grammy Awards: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జనవరి 31న జరగాల్సిన 64వ గ్రామీ అవార్డుల ఈవెంట్ వాయిదా పడింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవార్డు వేడుకను నిర్వహించే రికార్డింగ్ అకాడమీ ఈవెంట్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 31న జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ఓమిక్రాన్ వల్ల ప్రమాదం పెరగవచ్చని అకాడమీ అంచనా వేసింది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. గ్రామీ అధికారిక ప్రసార CBS, ది రికార్డింగ్ అకాడమీ ఈ విషయానికి సంబంధించి ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.
కొత్త తేదీ త్వరలో ప్రకటన సంగీత నిర్వాహకులు, ప్రేక్షకులు, వేడుక రూపొందించడానికి పనిచేసే సిబ్బంది, ఆరోగ్య భద్రత చాలా ముఖ్యమైనది. అందుకే కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. గత సంవత్సరం కూడా గ్రామీ అవార్డులు కొంతకాలం వాయిదా పడిన విషయం తెలిసిందే. 2021 ప్రారంభంలో చాలా ప్రధాన అవార్డుల మాదిరిగానే కరోనావైరస్ కారణంగా గ్రామీ అవార్డులను వాయిదా వేశారు. గత సంవత్సరం, స్టేపుల్స్ సెంటర్‌కు బదులుగా లాస్ ఏంజిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో అవుట్‌డోర్ సెట్‌లలో వేడుక జరిగింది. సెలబ్రిటీలు కూర్చునే ప్రదేశం కూడా మార్చారు. అంతే కాకుండా ప్రేక్షకుల సీటింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. అయితే గతేడాది రద్దీ కారణంగా లైవ్ ప్రదర్శనకు బ్రేక్ పడింది.
View this post on Instagram