Pujara Comments: రెండో టెస్ట్‌లో టీమిండియా గెలుస్తుందా..! వ్యూహం ఏంటి..? పూజారా కామెంట్స్..
Pujara Comments: దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ టెస్టులో నెగ్గిన భారత్.. రెండో మ్యాచ్‌లో పరిస్థితి దారుణంగా మారింది. కేవలం 240 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది.
Pujara Comments: దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ టెస్టులో నెగ్గిన భారత్.. రెండో మ్యాచ్‌లో పరిస్థితి దారుణంగా మారింది. కేవలం 240 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా బుధవారం రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. విజయానికి చాలా దగ్గరయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తిగా నిష్క్రమించలేదని, నాలుగో రోజు విజయం సాధించే అవకాశం ఉందని భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా చెబుతున్నాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా విజయానికి 122 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గర్ 46 పరుగులు, రోసీ వాన్ డెర్ డస్సెన్ 11 పరుగులతో ఆడుతున్నారు. భారత్ తరఫున శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు. పుజారా ప్రకారం.. మ్యాచ్‌లో నాలుగో రోజు మొదటి గంట చాలా కీలకం.
మొదటి గంట కీలకం మూడో రోజు ఆట ముగిసిన అనంతరం విలేకరుల సమావేశానికి వచ్చిన పుజారా మాట్లాడుతూ.. ‘పిచ్‌పై హెవీ రోలర్‌ను పరిగెత్తించిన తీరు కాస్త ఊరటనిచ్చింది. మళ్లీ పిచ్ పగుళ్లు రావడానికి సమయం పడుతుంది. ఒక గంట తర్వాత ఖచ్చితంగా పిచ్‌పై అసమాన బౌన్స్ ఉంటుంది. ఈ పరిస్థితిలో ప్రారంభంలో ఒక గంట జాగ్రత్తగా ఆడటం చాలా ముఖ్యం. దీంతో పాటు దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ వికెట్ కూడా చాలా ముఖ్యమైనదిగా పుజారా పేర్కొన్నాడు.
కోహ్లీ ఆరోగ్యంపై అప్‌డేట్ వెన్ను నొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లి గతంలో కంటే మెరుగ్గా ఉన్నాడని త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌ను పుంజుకుంటాడని పుజారా తెలిపాడు. “అధికారికంగా నేను మరిన్ని విషయాలు వెల్లడించలేను కానీ అతను (కోహ్లీ) ఇప్పుడు ఖచ్చితంగా మెరుగైన స్థితిలో ఉన్నాడు. అతను త్వరలో ఫిట్ అవుతాడని నేను భావిస్తున్నాను” అని పుజారా చెప్పాడు. వెన్నునొప్పి కారణంగా కోహ్లీ రెండో టెస్టుకు దూరమయ్యాడు అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ని తీసుకున్నారు. కోహ్లీ ఫిట్‌నెస్‌పై జట్టు ఫిజియో కచ్చితమైన స్థితిని చెప్పగలడని పుజారా అభిప్రాయపడ్డాడు.