PM Modi: ప్రధాని మోదీకి సెక్యూరిటీ, ప్రొటోకాల్ ఏ విధంగా ఉంటుంది..? పర్యటనకు సంబంధించి రాష్ట్రాలు చేయాల్సిన పనేంటి..
PM Modi: ప్రధానమంత్రి రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన భద్రతా ఏ విధంగా ఉంటుంది.? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటి..? పూర్తి భద్రతా ప్రోటోకాల్
PM Modi: ప్రధానమంత్రి రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన భద్రతా ఏ విధంగా ఉంటుంది.? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటి..? పూర్తి భద్రతా ప్రోటోకాల్ ఏం చెబుతోంది.. ప్రధాని మోదీ కాన్వాయ్ ఎలాంటి సెక్యూరిటీ మధ్య నడుస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ప్రధాని కాన్వాయ్‌లలో అత్యాధునిక వాహనాలు ఉంటాయి. అన్నింటిలో మొదటిది ముందస్తు భద్రతా కారు.. తర్వాత అడ్వాన్స్ పైలట్ కారు.. తర్వాత డైరెక్ట్ సెక్యూరిటీ కారు ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూర్చున్న వాహనంలో రెండు ఆర్మర్డ్ BMW 7 సిరీస్ సెడాన్‌లు, ఆరు BMW X5 లు, ఒక మెర్సిడెస్-బెంజ్ అంబులెన్స్‌తో పాటు మరో డజను వాహనాలు ఉంటాయి. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. తుపాకీ బుల్లెట్లు, బాంబు పేలుళ్ల ద్వారా ఇవి ప్రభావితం కావు.
100 మంది సైనికులు.. ప్రధానమంత్రి కాన్వాయ్‌తో పాటు ఒక జామర్ వాహనం ఉంటుంది. ఇది రహదారికి ఇరువైపులా 100 మీటర్ల దూరంలో ఉన్న ఏదైనా పరికరాన్ని నిర్వీర్యం చేయగలదు. ప్రధానమంత్రి కాన్వాయ్‌లో డమ్మీ కారు కూడా నడుస్తుంది. దాడికి పాల్పడే వ్యక్తులు అసలైన కారుని గుర్తుపట్టలేరు. ప్రధాని కాన్వాయ్ వెంట దాదాపు 100 మంది సైనికులు ఉంటారు. సాధారణంగా ప్రధానమంత్రి సెక్యూరిటీ సర్కిల్ ఈ విధంగా ఉంటుంది..
ప్రధానమంత్రి భద్రత సర్కిల్ దేశంలోనే ప్రధాని భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) మొదటగా సెక్యూరిటీ బాధ్యతలు చూసుకుంటుంది. రెండో సర్కిల్ వ్యక్తిగత గార్డులు. మూడో సర్కిల్ NSG కమాండోలు ఉంటారు. వీరు ఏ ఆపదలోనైనా సులువుగా పనిచేస్తారు. నాలుగో సర్కిల్ పారామిలటరీ దళం. ఇందులో కఠినమైన శిక్షణ పొందిన వివిధ పారామిలిటరీ బలగాలకు చెందిన అత్యుత్తమ సైనికులు ఉంటారు. ఐదో సర్కిల్ స్థానిక పోలీసులది. ప్రధాని వెళ్లే రాష్ట్రానికి చెందిన పోలీసులు ఐదో సర్కిల్‌కు సెక్యూరిటీ బాధ్యత నిర్వహిస్తారు.