WhatsApp: అదిరిపోయే ఫీచర్ తీసుకొస్తున్న వాట్సాప్.. ఇకపై నోటిఫికేషన్ బార్‌లో యూజర్ ఫోటో..
WhatsApp: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యధిక డౌన్‌లోడ్స్‌తో దూసుకుపోతోందీ మెసేజింగ్ యాప్. ఇక ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో..
WhatsApp: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యధిక డౌన్‌లోడ్స్‌తో దూసుకుపోతోందీ మెసేజింగ్ యాప్. ఇక ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతకీ క్రేజ్ ఉందని చెప్పాలి. ఇప్పటికే 2 బిలియన్లకు పైగా యూజర్లతో వాట్సాప్ ఫేవరేట్ మెసేజింగ్ యాప్‌గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా యూజర్లను మరింత అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.
సాధారణంగా మనకు ఇతరుల నుంచి వాట్సాప్‌లో మెసేజ్ రాగానే నోటిఫికేషన్ బార్‌లో మెసేజ్ వచ్చినట్లు అలర్ట్ వచ్చినట్లు కనిపిస్తుంది. బార్‌లో కనిపించే అలర్ట్‌ను క్లిక్ చేయగానే మెసేజ్ ఓపెన్ అవుతుంది. అయితే వాట్సాప్ తెస్తున్న ఈ కొత్త ఫీచర్ వల్ల ఇకపై నోటిఫికేషన్‌లో బార్‌లో మెసేజ్ పంపించిన వ్యక్తి ప్రొఫైల్ ఫోటో కనిపించనుంది. ఇప్పటి వరకు కేవలం పేరు మాత్రమే కనిపించే స్థానంలో ఫోటో కనిపించనుందన్నమాట. ఇదిలా ఉంటే వాట్సాప్ ఈ ఫీచర్‌ను తొలుత ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేనున్నారు.
Also Read: CES 2022: రంగులు మారే ఎలక్ట్రిక్ కారు.. ఎలక్ట్రానిక్స్ షోలో అబ్బురపరిచిన కొత్త సాంకేతికతలు!
Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..
ఒకే ఒక్క రక్త పరీక్షతో క్యాన్సర్‌ని గుర్తించవచ్చు..! పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి..