ఒకే ఒక్క రక్త పరీక్షతో క్యాన్సర్‌ని గుర్తించవచ్చు..! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు వెల్లడి..

ఒకే ఒక్క రక్త పరీక్షతో క్యాన్సర్‌ని గుర్తించవచ్చు..! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు వెల్లడి..
Blood Test

New Blood Test: క్యాన్సర్‌ను గుర్తించే రక్త పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్యాన్సర్ గురించిన సమాచారంతో పాటు ఇది శరీరంలో ఎంత వరకు

uppula Raju

|

Jan 05, 2022 | 7:13 PM

New Blood Test: క్యాన్సర్‌ను గుర్తించే రక్త పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్యాన్సర్ గురించిన సమాచారంతో పాటు ఇది శరీరంలో ఎంత వరకు వ్యాపించిందో కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం జనాలలో క్యాన్సర్‌ని నిర్ధారించడానికి పెద్దపేగు పరీక్ష, మామోగ్రఫీ, పాప్ పరీక్ష వంటి అనేక రకాల పరీక్షలు చేస్తున్నారు. కొత్త పరీక్ష సహాయంతో క్యాన్సర్‌ను మరింత సులభంగా గుర్తించవచ్చు.ఈ పరీక్షను అభివృద్ధి చేసినది ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. రోగులలో ఈ పరీక్ష మెటాస్టాటిక్ క్యాన్సర్‌ని గుర్తించగలదని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన రకం క్యాన్సర్ ఇది శరీరం అంతటా వ్యాపిస్తుందని తెలిపారు.

కొత్త రక్త పరీక్ష ఎలా పని చేస్తుంది? ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకారం.. కొత్త రక్త పరీక్ష ఎంత విజయవంతమైందో అర్థం చేసుకోవడానికి 300 మంది రోగుల నమూనాలను తీసుకున్నారు. ఈ రోగులలో 94 శాతం మందిలో క్యాన్సర్ విజయవంతంగా కనుగొన్నారు. ఈ పరీక్షలో ప్రత్యేక సాంకేతికత ఉపయోగించారు. దీనిని NMR ప్రక్రియ అంటారు. పరిశోధకుడు డాక్టర్ జేమ్స్ లార్కిన్ మాట్లాడుతూ.. మనిషి శరీరంలో అనేక రకాల రసాయనాలు తయారవుతాయి. వీటిని బయోమార్కర్స్ అంటారు. వీటిని పరిశీలించడం ద్వారా మానవ శరీరం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక కొత్త రక్త పరీక్ష చేయడం ద్వారా ఒక వ్యక్తి క్యాన్సర్‌తో పోరాడుతున్నాడా లేదా అని చెప్పే బయోమార్కర్లను గుర్తించడం జరుగుతుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు శరీరంలో కొన్ని రకాల బయోమార్కర్లు కనిపిస్తాయి ఇవి రక్త పరీక్షల ద్వారా బయటపడుతాయి.

రోగులకు ఉపశమనం ఎలా..? ప్రస్తుతం రోగులలో క్యాన్సర్‌ని నిర్ధారించడానికి అనేక రకాల పరీక్షలు చేయాలి. అవి ఖరీదైనవి. దీంతో పాటు వాటిని పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. కొత్త రక్త పరీక్ష రోగులకు సులభమైన ఎంపిక. ఎందుకంటే రక్త నమూనాలను తీసుకోవడం సులభం. క్యాన్సర్‌తో పోరాడుతున్నారా లేదా అని చెప్పడం కష్టంగా ఉన్న నిర్దిష్ట లక్షణాలు లేని రోగులలో కూడా ఈ రక్త పరీక్ష చేయవచ్చని పరిశోధకులు అంటున్నారు. దీని కోసం నిధులను సృష్టించడమే మా తదుపరి లక్ష్యం అని పరిశోధకుడు లార్కిన్ చెప్పారు. ఇది కాకుండా, తదుపరి క్లినికల్ ట్రయల్ కింద 3 సంవత్సరాలలో 2 నుంచి 3 వేల మంది రోగులను పరీక్షించనున్నారు. ఈ ట్రయల్స్ ఆధారంగా రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఆమోదం పొందుతాము. తర్వాత సామాన్యులకు క్యాన్సర్ పరీక్షలు చేయడం సులభతరం అవుతుంది.

అత్తిపండ్లు అధికంగా తింటే హానికరమే..! ఈ సమస్యలున్నవారు అస్సలు తినకూడదు..

Turmeric Side Effects: ఈ వ్యక్తులు పసుపును అస్సలు తినకూడదట.. ఎందుకో తెలుసా..

Health Care Tips: పాలతో పాటు వీటిని తింటున్నారా? అయితే ఈ ముప్పు తప్పదు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu