Big News Big Debate: తెలంగాణ వ్యాప్తంగా పేలుతున్న పొలిటికల్ డైనమేట్స్.. ఫ్లవర్ అండ్ ఫైర్ పాలిటిక్స్
బండి అరెస్టు అనంతరం పరిణాలల్లో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య దూషణల పర్వం కొనసాగుతోంది. అయితే ఇదంతా డ్రామానే అంటోంది కాంగ్రెస్.
Big News Big Debate on TRS vs BJP: బీజేపీ అంటే దేశంలో చిల్లర రాజకీయాలు చేస్తూ.. నాలుగు ఓట్లు రాబట్టే బక్వాస్ జుమ్లా పార్టీ అన్నారు కేటీఆర్. కేసీఆర్‌కు మెంటల్ బ్యాలెన్స్ లేదన్న నడ్డా వ్యాఖ్యలపై తీవ్రం స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. బండి అరెస్టు అనంతరం పరిణాలల్లో ఇరు పార్టీల మధ్య దూషణల పర్వం కొనసాగుతోంది. అయితే ఇదంతా డ్రామానే అంటోంది కాంగ్రెస్.
తెలంగాణలో కమలం, కారు పార్టీల మధ్య మాటలయుద్ధం. కేసీఆర్ పైనా, ఆయన కుటుంబంపైనా BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా సంచలన ఆరోపణలు చేశారు. ధీటుగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారి వేడెక్కాయి. హైదరాబాద్ వచ్చిన జేపీ నడ్డా TRS ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కుటుంబ పాలనలో నియంతృత్వ పోకడలు ఉన్నాయని.. ప్రజాస్వామ్యమే లేదంటూ కామెంట్ చేశారు నడ్డా.
పైగా వ్యక్తిగతంగా CM KCRపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా గులాబీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో రంగంలో దిగిన వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలతో ముంచెత్తారు. చిల్లర రాజకీయం చేస్తూ.. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బీజేపీ ఆలోచనగా ఉందన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు అని హామీలిచ్చిన ప్రధాని మోదీ.. చివరకు రైతు విరోధిగా మారారన్నారు. 20 నిమిషాలు మోడీని రోడ్డుపై రైతులు నిలబెట్టారన్నారు. ప్రశ్నిస్తే ED, CBI వంటి సంస్థలను ప్రయోగిస్తారని ఆరోపించారు. కుటుంబ పాలన అంటూ నడ్డా మాట్లాడటం విడ్డూరమన్న మంత్రి.. JPనడ్డా అత్త జయశ్రీ బెనర్జీ నిన్నటిదాకా మంత్రిగా లేరా అని ప్రశ్నించారు? దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసిందే బీజేపీ అని మండిపడ్డారు KTR.
ఇరుపార్టీల మధ్య మాటలతూటాలు పేలుతుంటే.. ఇందతా డ్రామా అంటోంది కాంగ్రెస్. మొత్తానికి మూడు పార్టీల మధ్య ఫైటింగ్ హైరేంజ్ లో ఉంది. బీజేపీ-టీఆర్ఎస్ నిజంగానే నాటకమాడుతున్నాయా? పోరాటం చేయలేని స్థితికి కాంగ్రెస్ దిగజారితే ఆ అవకాశాన్ని బీజేపీ అందిపుచ్చుకుంటుందా? ఇంతకీ TRS ఎవరిని తనకు ప్రత్యర్ధిగా చూస్తోంది అన్న చర్చ జనాల్లో జరుగుతోంది.
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.