Big News Big Debate: భారత్‌లో కొవిడ్ సునామీ విలయం తప్పదా?.. ఒమిక్రాన్‌తో కరోనా ఎండమిక్ అవుతుందా?
దేశవ్యాప్తంగా కోవిడ్ థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది. ప్రభుత్వం అధికారికంగానే దీనిపై ప్రకటన చేసి జనాలను అలర్ట్ చేస్తోంది. గంట గంటకూ కేసులు పెరుగుతున్నాయి.
భారత్‌లో కొవిడ్ సునామీ విలయం తప్పదా? కొట్టుకుపోయే ప్రాణాలెన్ని? ఒడ్డుకు చేరే మార్గమేది? వ్యాక్సిన్ సంజీవనీ కాదా? రక్షణ ఉత్తమాటేనా? ఒమిక్రాన్‌తో కరోనా ఎండమిక్ అవుతుందా?
మరో వారం పదిరోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా సునామీ తరహాలో విలయం సృష్టించనుంది. ఇప్పటికే 8 శాతానికి పైగా పాజిటివిటీ రేటుతో 24 గంటల్లో 90వేలకు పైగా కేసులు నమోదు కాగా.. రాబోయే కొద్దిరోజుల్లో 4 నుంచి 10 లక్షల కేసులు వస్తాయని అంచనా. అయితే ఒమిక్రాన్ వల్ల ఎలాంటి ముప్పు ఉండదని.. జాగ్రత్తగా ఉండాలని మాత్రమే హెచ్చరిస్తోంది ICMR. మొదటి రెండు వేవ్‌లతో పోలిస్తే కేసులు భారీగా పెరిగినా మరణాల రేటు తక్కువగానే ఉంటుందంటోంది ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా కోవిడ్ థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది. ప్రభుత్వం అధికారికంగానే దీనిపై ప్రకటన చేసి జనాలను అలర్ట్ చేస్తోంది. గంట గంటకూ కేసులు పెరుగుతున్నాయి. ఉప్పెన మాదిరిగా కరోనా విలయతాండవం చేస్తోంది. గత రెండు రోజుల్లోనే ఇండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జనవరి 5న యాభై వేల కేసులు రిపోర్ట్ అయితే.. గత 24 గంటల్లోనే 90వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జనవరి మూడో వారం నుంచి మార్చి వరకూ కరోనా విలయమే అంటున్నాయి సర్వేలు. రానున్న రెండు వారాలు కీలకం అంటున్న నిపుణులు.. ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు.
కొత్త వేరియంట్ కారణంగా వ్యాప్తి రేటు భారీగా పెరిగింది. ఒక్కరి నుంచి ముగ్గురికి సోకుతోంది వైరస్. సెకండ్ వేవ్ పీక్‌లో ఉన్నా కూడా 1.69శాతం మాత్రమే ఉండేది. మరణాలు అధికంగా సంభవించిన సెకండ్ వేవ్‌లో 9వేల నుంచి 90వేలకు కేసులకు చేరడానికి పట్టిన సమయం 50 రోజులు అయితే.. థర్డ్ వేవ్‌లో పది రోజుల్లోనే ఈ నెంబర్లు అందుకోవడం కొవిడ్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అమెరికా, యూరప్ తరహా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు తెలంగాణ, ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు వైద్యులు. రోజువారీ కోవిడ్ పాజిటివ్ కేసులు లక్షల్లో చేరతాయని వార్నింగ్ ఇస్తున్నారు. . ఒమిక్రాన్ సోకిన వారిలో సాధారణ లక్షణాలే కనిపించినా ప్రమాదమే అంటోంది WHO. రోగులను గుర్తించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని.. లేదంటే ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ముంచుకొస్తున్న ముప్పును అధిగమించడం ప్రభుత్వాలకు పెనుసవాలుగా మారింది. అగ్రదేశాలతో పోలిస్తే డెన్‌సిటీ అత్యధికంగా ఉండే మనదేశంలో కంట్రోల్ చేయడానికి కేంద్రంతోపాటు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు ఫలిస్తాయా.?— బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్
ఈ అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ వీడియో దిగువన చూడండి.