IND vs SA : మూడోరోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 8 వికెట్లు.. సౌతాఫ్రికాకి 122 పరుగులు..
IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరగుతున్న రెండో టెస్ట్‌లో భాగంగా మూడో రోజు ఆట ముగిసింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 118
IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరగుతున్న రెండో టెస్ట్‌లో భాగంగా మూడో రోజు ఆట ముగిసింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. విజయానికి 122 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గర్ 46 పరుగులు, వాన్ డస్సెన్ 11 పరుగులతో ఉన్నారు. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. భారత బౌలర్లలో అశ్విన్ 1, శార్దుల్ ఠాగూర్ ఒక వికెట్ సాధించారు. కాగా భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయి సౌతాఫ్రికాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ఘోరంగా విఫలమైంది. భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. మిడిలార్డర్‌లో బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ సరిగ్గా రాణించకపోవడంతో తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది. మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 85/2 పరుగులతో ఆట ప్రారంభించగా.. క్రీజులో నిలిచిన చటేశ్వార పూజారా, అజింకా రహానె ఆచితూచి ఆడారు. మూడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ని గట్టెక్కించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. పూజారా 86 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 53 పరుగులు, రహానె 78 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్‌తో 58 పరుగులు చేశారు. అయితే ఈ ప్రారంభాన్ని మిగతా బ్యాట్స్‌మెన్లు ఎవ్వరూ కొనసాగించలేకపోయారు.
వీరిద్దరు వెనువెంటనే ఔట్ కావడంతో మిగతావారెవ్వరు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. హనుమ విహారి ఒక్కడే చివరి వరకు నాటౌట్‌గా ఉండి 40 పరుగులు (84 బంతుల్లో 6 ఫోర్లు) చేశాడు. శార్దుల్ ఠాగూర్ 28 పరుగులు పర్వాలేదనిపించాడు. దీంతో భారత్ 266 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్, జాన్సన్ 3 వికెట్లు, ఎంగిడి 3 వికెట్ సాధించారు. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ కాగా దక్షిణాఫ్రికాను 229 పరుగులకు ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే.