IND vs SA: రిషబ్ పంత్ ఇదేం ఆట.. ఆగ్రహం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్..

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జొహన్నెస్‌బర్గ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ ఖాతా తెరవకూండనే  ఔటయ్యాడు. అయితే..

IND vs SA: రిషబ్ పంత్ ఇదేం ఆట.. ఆగ్రహం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్..
Pant
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 06, 2022 | 6:59 AM

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జొహన్నెస్‌బర్గ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ ఖాతా తెరవకూండనే  ఔటయ్యాడు. అయితే అతడిని ఔట్ అయిన తీరు క్రికెట్ నిపుణులు, అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. రిషబ్ పంత్‌ను కగిసో రబాడ అవుట్ చేశాడు. దీంతో కామెంట్రీ చెబుతున్న సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంత్ ఆడిన ఆట తీరుపై ఘాటుగా స్పందించాడు. పంత్ బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉందని అన్నాడు.

రిషబ్ పంత్ ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. ఛెతేశ్వర్ పుజారా ఔటైన తర్వాత అతను మైదానంలోకి వచ్చాడు. కానీ పంత్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మూడు బంతులు ఆడిన అతను ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగాడు. అతను కగిసో రబాడ బౌలింగ్‎లో కీపర్ కైల్ రెన్‎కు క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందు రెండు బంతుల్లో రబాడ బౌలింగ్‎లో పంత్ చాలా ఇబ్బంది పడ్డాడు. సహచర ఆటగాళ్లు తక్కువ పరుగులకే ఔట్ అవుతుంటే పంత్ మూడో బంతికే క్రీజు నుంచి బయటకు భారీ షాట్ కొట్టాడు. కానీ బంతి ఎడ్జ్‌కి చేరి కీపర్‌ గ్లవ్స్‌లో చిక్కుకుంది. రిషబ్ పంత్ అవుటయ్యే సమయానికి భారత్ స్కోరు 167 పరుగులు.

దీనిపై సునీల్ గవాస్కర్ స్పందంచాడు. ఈ షాట్‌కు ఎలాంటి మన్నన లేదు. “దక్షిణాఫ్రికా పర్యటనలో రిషబ్ పంత్ ఇంకా ఆడలేడు. అతను సెంచూరియన్ టెస్టులో ఎనిమిది, 34 పరుగులు చేశాడు. జోహన్నెస్‌బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులు మాత్రమే చేశాడు.” అని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడం రిషబ్‌ పంత్‌కి ఇదే తొలిసారి. అయితే అతను ఇటీవలి మ్యాచ్‌ల్లోనూ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీ చేసినప్పటి నుంచి అతను ఒక్క అర్ధశతకం మాత్రమే చేయగలిగాడు.

Read Also. NZ vs BAN: కివీస్ వరుస విజయాలకు ఫుల్‌స్టాప్ పెట్టిన బంగ్లా.. స్వదేశంలో ఓటమితో పలు చెత్త రికార్డులు