Guava Side Effects: వీరు జామపండ్లను అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి!

జామపండ్లలో వివిధ పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ, ఏ, ఈ, ఫైబర్, ఐరన్, క్యాల్షియం, మ్యాంగనీస్...

Guava Side Effects: వీరు జామపండ్లను అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి!
Guava
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 12, 2022 | 8:26 PM

జామపండ్లలో వివిధ పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ, ఏ, ఈ, ఫైబర్, ఐరన్, క్యాల్షియం, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు మనం శరీరాన్ని బలోపేతం చేయడంలో దోహదపడతాయి. అలాగే జామపండ్లు తరచూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అటు జలుబు, దగ్గు లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జామపండ్లు తినాలని డాక్టర్లు సూచిస్తారు. అయితే దగ్గుతో బాధపడేవారిని జామపండ్లకు బదులుగా జామకాయలను తినమని సలహా ఇస్తారు. ఎందుకంటే అవి తినడం వల్ల శ్లేష్మాం సమస్య తగ్గుతుంది. మరోవైపు జామ ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఆయుర్వేదంలో, వీటిని దగ్గు, ఇతర వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. శీతాకాలంలో పండ్లలో రారాజైన జామపండ్ల సూపర్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • చాలామందిలో ఓ సందేహం ఉండొచ్చు.. డయాబెటిక్ పేషెంట్లు జామ తినాలా.. వద్దా.? మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లను ఎక్కువగా తినకూడదనేది నిజమే. కానీ చాలా మంది వైద్య నిపుణులు ఈ రోగులను కనీసం రోజుకో పండు తినమని సలహా ఇస్తారు. ఇక వారు జామపండు తింటే.. అది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది పలు అధ్యయనాల్లో కూడా నిరూపితమైంది. అయితే వీరు కూడా పరిమితిగా తినాలి. మోతాదు మించకూడదు.
  • జామలో డైటరీ ఫైబర్ ఉంటుంది. అది మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేసేలా చేస్తుంది. అయితే రాత్రిపూట మాత్రం జామపండ్లను తినొద్దు.
  • బరువు తగ్గాలనుకునేవారికి జామపండ్లు సరైన ఆప్షన్. జామలో ఎక్కువ కేలరీలు ఉండవు. అలాగే డైటరీ ఫైబర్ కారణంగా మీకు ఎక్కువసేపు ఆకలి వేయదు. తద్వారా మీరు బరువును నియంత్రించవచ్చు.
  • క్యాన్సర్ వ్యాధిని నివారించడంలో జామపండు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. లైకోపీన్, క్వెర్సెటిన్, పాలీఫెనాల్స్ కూడా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. అలాగే జామ ఆకులు క్యాన్సర్ చికిత్సలో కూడా ప్రభావం చూపిస్తాయి.
  • గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో జామపండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో దోహదపడుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది.

అలాగే కడుపు ఉబ్బరంగా ఉన్నవారు, మాటిమాటికీ టాయిలెట్‌కు వెళ్లే సమస్య ఉన్నవారు, దంతాల, చిగుళ్ల సమస్య ఉన్నవారు జామపండ్లకు దూరంగా ఉంటే మంచిది లేదంటే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.

Also Read:

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!

మద్యం షాప్ దగ్గర ఆగి ఉన్న ఇన్నోవా కారు.. అనుమానంతో డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!

భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!