Salt Water: నీళ్లలో ఉప్పు వేసుకుని తాగితే ఈ సమస్యలకు చెక్.. ఈ విషయాలను తెలుసుకోండి..
ఉప్పులో అనేక మంచి గుణాలున్నాయన్న సంగతి తెలిసిందే. మనం రోజూ తీసుకునే ఉప్పు శుద్ది చేసినది. సాధారణంగా ఉప్పు తీసుకోవడం
ఉప్పులో అనేక మంచి గుణాలున్నాయన్న సంగతి తెలిసిందే. మనం రోజూ తీసుకునే ఉప్పు శుద్ది చేసినది. సాధారణంగా ఉప్పు తీసుకోవడం వలన జీర్ణశక్తిని, రోగ నిరోధక శక్తిని, రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే మినరల్స్ ఉంటాయి. ఓ చిటికెడు ఉప్పును నీళ్లలో వేసి రాత్రంతా కలిపి ఉంచి.. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయి. కడుపులో ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కావాల్సిన ఆమ్లాలు తగినంతగా ఉత్పత్తి అవుతాయి. దాని వలన అజీర్ణం బాధ తగ్గుతుంది. అలాగే చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
అలాగే నీళ్లల్లో బ్లాక్ సాల్ట్ వేసుకుని తాగితే అజీర్తి సమస్యలు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఉప్పు నీళ్లు తాగడం వలన మంచి నిద్ర పొందొచ్చు. పాజిటివ్ ఎఫెక్ట్ కలుగుతుంది. చిటికెడు ఉప్పును నీళ్లల్లో వేసుకుని తాగడం వలన ఆస్తమా సమస్య తగ్గుతుంది. అలాగే రక్తపోటు కంట్రోల్ లో ఉండాలంటే సోడియం కావాలి. రక్తపోటు తగ్గినప్పుడు నీళ్లలో కాస్త ఉప్పు వేసుకుని తాగితే కంట్రోల్ అవుతుంది. ఉప్పునీరు తాగడం వలన పొట్ట, పేగులు క్లీన్ అవతాయి. ఎండలో బయట తిరిగి డిహైడ్రేట్ అయినవారికి గ్లాసుడు ఉప్పునీరు ఇస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయి. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు నీటిని పుక్కిలించాలి. దీంతో నోట్లో ఉండే బ్యాక్టిరియా నాశనమవుతుంది. ఉప్పు నీటిలో పది నిమిషాల పాటు అరికాళ్లను ఉంచాలి. ఇలా చేస్తే పాదాల సమస్యలు తగ్గడమే కాకుండా.. ఉత్సాహంగా ఉంటారు. అయితే ఉప్పును అధికంగా తీసుకున్న ప్రమాదమే.
Also Read: Pooja Hegde: బుట్టబొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హతో ఆసక్తికరమైన వీడియో..
Teaser Talk: అసలు మనిషి చర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హన్సిక కొత్త సినిమా టీజర్..
Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు
Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..