Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీకు రక్తహీనత సమస్య ఉన్నట్లే..
Health: శరీరలో ఎలాంటి వ్యాధులు ఉన్నా ముందుగా శరీరం కొన్ని లక్షణాల ద్వారా మనల్ని అలర్ట్ చేస్తుంది. లక్షణాలను ముందుగా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే వ్యాధికి చెక్ పెట్టవచ్చు...

Health: శరీరలో ఎలాంటి వ్యాధులు ఉన్నా ముందుగా శరీరం కొన్ని లక్షణాల ద్వారా మనల్ని అలర్ట్ చేస్తుంది. లక్షణాలను ముందుగా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే వ్యాధికి చెక్ పెట్టవచ్చు. ఇలా నెమ్మదిగా మనకు తెలియకుండా వచ్చే ఆరోగ్య సమస్యల్లో రక్త హీనత ఒకటి. ఐరన్ లోపంతో పాటు ఇతర కారణాల కారణంగా రక్త హీనత వస్తుంది. మరి రక్త హీనత ఉన్నట్లు ముందుగానే తెలిపే కొన్ని లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
* రక్త హీనతతో బాధపడే వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. కాసేపు నడిచినా వీరికి వెంటనే ఆయాసం వస్తుంది. ఈ సమస్య ఎంతకీ తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
* శరీరంలో రక్తం తక్కువగా ఉంటే రక్తకణాల సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ కారణంగానే చర్మం రంగు మారుతుంది. ఇలా చర్మం రంగు సడెన్‌గా మారితే అది రక్త హీనతేనని గుర్తించాలి.
* ఎడతెరపి లేకుండా ఛాతిలో నొప్పి అనిపిస్తే కూడా రక్త హీనత కారణమై ఉండవచ్చు. దీనికి కారణంగా రక్తం సరిపడ లేకపోతే శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఇది చాతి నొప్పికి దారి తీస్తుంది. కాబట్టి చాతిలో నొప్పిఅనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
* శరీరం నిత్యం చల్లగా ఉంటే శరీరంలో సరిపడ రక్తం లేనట్లే. శరీరంలో రక్తం ఉంటే అన్ని భాగాలకు ఉష్ణం సరిగ్గా సరఫరా అవుతుంది. దీంతో శరీరం వేడిగా ఉంటుంది.
* తరచూ తలనొప్పిగా అనిపిస్తే కూడా రక్త హీనతతో బాధపడుతున్నట్లు అనుమానించాలి. ఎంతకీ తలనొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Telangana Corona: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా ఎన్ని కేసులంటే..
Hansika: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేసిన మై నేమ్ ఈజ్ శృతి టీజర్.. ఆకట్టుకున్న హన్సిక