AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేసిన మై నేమ్ ఈజ్ శృతి టీజర్.. ఆకట్టుకున్న హన్సిక

దేశముదురు సినిమా సినిమా విడుదలై నేటికీ సరిగ్గా 15 సంవత్సరాలు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ హన్సిక.

Hansika: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేసిన మై నేమ్ ఈజ్ శృతి టీజర్.. ఆకట్టుకున్న హన్సిక
Hansika
Rajeev Rayala
|

Updated on: Jan 12, 2022 | 6:19 PM

Share

Hansika: దేశముదురు సినిమా సినిమా విడుదలై నేటికి సరిగ్గా 15 సంవత్సరాలు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ హన్సిక. మొదటి సినిమాతోనే అందంతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ వయ్యారి భామ. ఇక దేశముదురు సినిమామ్చ్న్హి విజయం సాధించడం తో ఈ బ్యూటీ కి క్రేజీ ఆఫర్లు క్యూ కట్టాయి. వరుసగా సినిమాలు చేసి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ రేస్ లో జాయిన్ అయిపోయింది. ఆతర్వాత ఈ అమ్మడు తమిళ్ లోను అవకాశాలు అందుకుంటూ రాణించింది. ఈ మధ్య కాలంలో హన్సిక జోరు కాస్త తగ్గినట్టు కనిపిస్తుంది. ఈ అమ్మడు సినిమాలు అంతకు ముందులా ప్రేక్షకుల ముందుకు రావడంలేదు. అడపా దడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది హన్సిక. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తుంది ఈ భామ. ఈక్రమంలోనే ఇప్పుడు ఓ అదిరిపోయే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ శృతి అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఆర్గాన్ మాఫీయా నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. వైష్ణవి ఆర్ట్స్ పథకం పై రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా వుండే కథాంశంతో, సర్‌ప్రైజింగ్‌గా వుంటే ట్విస్ట్‌లతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాన్సిక పాత్ర ఎంతో వైవిధ్యంగా వుంటుందని తెలుస్తుంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతి పాత్రలో హన్సిక కనిపించనుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై తెరకక్కిన ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ టీజర్ చాలా బాగుంది. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్.. కచ్చితంగా సక్సెస్ అవుతారనే నమ్మకం ఉంది. టాలెంట్ ఉంటే విజయాలు వాటంతట అవే వస్తాయి అన్నారు తలసాని. ఇక మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్, పూజా రామచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు నిర్మాతలు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: ఏపీ సినిమా టికెట్స్ రేట్స్ వివాదంపై స్పందించిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..

Radhe Shyam: ‘ఇలా అన్నారంటే వచ్చి కొడతా’.. ప్రభాస్ అభిమానికి ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్..

Ala Vaikuntapuramuloo: బన్నీకి ఈరోజు చాలా స్పెషల్.. ఫ్యాన్స్‏కు థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్