Radhe Shyam: ‘ఇలా అన్నారంటే వచ్చి కొడతా’.. ప్రభాస్ అభిమానికి ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్..
'రాధేశ్యామ్'.. ప్రజంట్ దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది మొదటి వరసలో ఉంటుంది. బహుబలి, సాహో అనంతరం ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది.
‘రాధేశ్యామ్’.. ప్రజంట్ దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది మొదటి వరసలో ఉంటుంది. బహుబలి, సాహో అనంతరం ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్లుగా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘రాధేశ్యామ్’ తెరకెక్కించారు. అన్నీ బాగుండి ఉంటే ఈ సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ సినిమా థియేటర్లలో సందడి చేసేది. కానీ కరోనా దెబ్బకి వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు సిట్యువేషన్స్ నార్మల్ అవుతాయో తెలియన పరిస్థితి. కాగా ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్ దర్శకుడు. అయితే ఈ మధ్య రాధాకృష్ణ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం ప్రభాస్ ఫ్యాన్స్. మూవీ అప్ డేట్స్ సరిగ్గా ఇవ్వడం లేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అటు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ను, ఇటు దర్శకుడిని ట్విట్టర్ వేదికగా చెడుగుడు ఆడుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రభాస్ అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఇంట్రస్టింగ్ ఆన్సర్స్ చెప్పారు. ‘మీపై మీమ్స్ ను చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి..?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘అవే నా స్ట్రెస్ బస్టర్స్’ అని వెల్లడించారు. ‘మీరు ప్రభాస్ ని ఏమని పిలుస్తారని’ మరో నెటిజన్ ప్రశ్నించగా.. ‘సార్’ అని చెప్పుకొచ్చారు. .’సినిమా గురించి ఒక్క మాటలో చెప్పండి’ అని మరో నెటిజన్ అడగ్గా.. ‘లవ్’ అని అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమాని ఒకరు.. ‘హలో అన్నా.. రిప్లై ఇవ్వకపోతే సూసైడ్ లెటర్ రాసుకుంటా..’ అని బెదిరించగా.. అది చూసిన రాధాకృష్ణ ‘ఇలా బెదిరిస్తే వచ్చి బమ్స్ మీద కొడతా..’ అంటూ స్మైలీ ఎమోజీలను షేర్ చేశారు.
@director_radhaa hello anna replay evakapotha sucide letter rasukunta
— PRABHAS?ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ? (@PRABHAS_RAJU390) January 11, 2022
Ela bediristhe vachi bums mida kodatha ??
— Radha Krishna Kumar (@director_radhaa) January 11, 2022
Also Read: Viral Video: నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్