Ala Vaikuntapuramuloo: బన్నీకి ఈరోజు చాలా స్పెషల్.. ఫ్యాన్స్‌కు థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అల వైకుంఠపురంలో.. ప్రతిష్టాత్మకంగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అల వైకుంఠపురంలో (Ala Vaikuntapuramuloo ).. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ కలెక్షన్స్‌తో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్స(Allu Arjun) రసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ద(Trivikram) ర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా 2020లో జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది.
కథ విషయానికి వస్తే.. టబు, రోహిణిలు ఒకేసారి ఒకే ఆసుపత్రిలో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిస్తారు. రోహిణి భర్త మురళీశర్మ తన కొడుకు డబ్బున్న ఇంట్లో పెరగాలనే ఆశతో పిల్లలను మారుస్తాడు. 20 ఏళ్ల తర్వాత బంటు (అల్లు అర్జున్) బిజినెస్ పనిలో భాగంగా తన సొంత తండ్రి రామచంద్ర కలవడానికి వెళ్లి అతడిని ప్రమాదం నుంచి రక్షించడం.. ఆ తర్వాత అతనే తన తండ్రి అని తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత. రామచంద్ర కుటుంబంతో బంటు కలిసిపోవడం.. అసలు విషయం తనవాళ్లకు ఎలా తెలిసిందనేది సినిమా. ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించి డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు త్రివిక్రమ్. ఆయన మ్యాజిక్‌కు బన్నీ స్టైల్, కామెడీ టైమింగ్, పర్ఫామెన్స్ తోడై ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అనిపించింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలకపాత్రలో నటించిగా.. సచిన్ కేడ్కర్, సునీల్, వెన్నెల కిశోర్, నవదీప్, రాహుల్ రామకృష్ణ నటించారు. ఈ సినిమా విడుదలై నేటికి రెండెళ్లు కావడంతో అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేశారు. అల వైకుంఠపురంలో సినిమా షూటింగ్ సమయంలో బన్నీ, త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కలిసి ముచ్చటిస్తున్న ఫోటోను షేర్ చేశారు అల్లు అర్జున్ (Allu Arjun). చిత్రయూనిట్ కు శుభాకాంక్షాలు తెలిపారు బన్నీ.
View this post on Instagram
Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..