Trisha Krishnan : కరోనాను జయించిన అందాల భామ త్రిష.. కానీ చివరిలో ట్విస్ట్ ఇచ్చిందిగా..
కరోనా కలకలం కొనసాగుతుంది. సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకు అందరు కరోనా బారిన పడుతున్నారు. రోజు రోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Trisha Krishnan : కరోనా కలకలం కొనసాగుతుంది. సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకు అందరు కరోనా బారిన పడుతున్నారు. రోజు రోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినిమా తారలు వరుసగా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పలువురు తారలు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో ఇప్పటికే టాలివుడ్ లో మహేష్ బాబు, కీర్తిసురేష్, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు అందాల భామ త్రిష కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దాంతో ఆమె అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. కరోనా బారి నుంచి త్రిష త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది హీరోయిన్ త్రిష.
తాను కరోనా నుంచి కోలుకున్ననని తెలిపింది త్రిష సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ అందమైన ఫోటోను షేర్ చేసి. ఈ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది. ‘ఇప్పుడు నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను 2022’ అని రాసుకొచ్చింది త్రిష. ‘అన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నా నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పే కొన్ని క్షణాల ముందు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మీకు తెలిసిన అన్ని లక్షణాలు నాకున్నాయి. నాకు ఆ వారం చాలా బాధ కలిగించింది. ప్రస్తుతానికి నేను కోలుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ‘నెగిటివ్’ అనే పదం చదివినప్పటికీ సంతోషంగా లేనంటూ.. కానీ కరోనానను మాత్రం జయించానని క్లారిటీ ఇచ్చింది త్రిష. దాంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Never been happier to read the word “negative” on a report? Thank u all for your love and prayers❤️ Now I’m ready for you 2022? pic.twitter.com/3Cbn9QAXi0
— Trish (@trishtrashers) January 12, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :