Naga Chaitanya: ఇద్దరి మంచికే.. సమంతతో విడాకులపై నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్..
సమంతతో విడాకులపై హీరో అక్కినేని నాగచైతన్య తొలిసారిగా స్పందించారు. విడాకులతో ఇద్దరం హ్యాపీగా...
సమంతతో విడాకులపై హీరో అక్కినేని నాగచైతన్య తొలిసారిగా స్పందించారు. విడాకులతో ఇద్దరం హ్యాపీగా ఉన్నామని.. ఇద్దరి మంచి కోసమే తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. ఈ సిట్యువేషన్ ఇది ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని అన్నారు. ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా అడిగిన ఈ ప్రశ్నకు నాగచైతన్య పైవిధంగా పేర్కొన్నారు.
మరోవైపు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నప్పటి నుంచి.. చూడముచ్చటైన జంట ఇలా విడిపోయారేంటి.! వారి ఫ్యాన్స్ బాధపడ్డారు. అలాగే విడాకుల ప్రకటన చేసిన దగ్గర నుంచి వీరిద్దరిపై ఎన్నో గాసిప్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అటు సమంత కొన్ని రోజుల క్రితం విడాకులపై స్పందించగా.. తాజాగా నాగచైతన్య తన ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు.
కాగా, అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read:
ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్.. కష్టం కాదు.!
మద్యం షాప్ దగ్గర ఆగి ఉన్న ఇన్నోవా కారు.. అనుమానంతో డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!