Warangal: మద్యం షాప్ దగ్గర ఆగి ఉన్న ఇన్నోవా కారు.. అనుమానంతో డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!

కొన్ని రోజుల క్రితం వాహనం చెడిపోవడంతో స్నేహా బార్ సమీపంలో నిలిపి ఉంచారు. దాదాపు వారం రోజుల తర్వాత...

Warangal: మద్యం షాప్ దగ్గర ఆగి ఉన్న ఇన్నోవా కారు.. అనుమానంతో డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!
Car

ఉమ్మడి వరంగల్‌ జిల్లా హన్మకొండ(Hanmakonda)లో డెడ్‌ బాడీ కలకలం రేపింది. వరంగల్(Warangal) జిల్లా నర్సంపేట్‌కు చెందిన వేల్పుకొండ రమేష్ హన్మకొండ చౌరస్తాలోని బాలాజీ స్వీట్ హోమ్ యజమాని నర్సింహా వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం వాహనం చెడిపోవడంతో స్నేహా బార్ సమీపంలో నిలిపి ఉంచారు. దాదాపు వారం రోజుల తర్వాత కారులోంచి దుర్వాసన రావడంతో స్థానికులు డోర్ ఓపెన్ చేసి చూడగా రమేశ్ మృతిచెంది ఉన్నాడు. మద్యం అలవాటు ఉన్న రమేశ్ మద్యం సేవించి వాహనం డోర్ గ్లాసులతో సహా మూసి నిద్రపోవటంతో ఊపిరాడక మృతి చెందినట్టుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని అన్న, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం ఎంజీఎం తరలించినట్లు సీఐ తెలిపారు.

కేసులో పురోగతి…

హన్మకొండ చౌరస్తా సమీపంలో కారులో డెడ్ బాడీ మిస్టరీని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పలు కీలక విషయాలను సేకరించారు. ఈ నెల 5వ తేదీన స్నేహ బార్‌లో మద్యం సేవించిన రమేశ్ వెళ్లి కారులో పడుకున్నట్లు సీసీ కెమెరాలలో రికార్డు అయింది. మద్యం సేవించి కారులో పడుకున్న క్రమంలో ఏదైనా అనారోగ్యానికి గురై రమేశ్ చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Also Read:

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!

ఈ పాము చాలా డేంజర్.. దీని వేట మాములుగా ఉండదు.. దొరికితే జ్యూస్‌లా చేసి తాగేస్తుంది!

 ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటల వికృత రాసలీలలు.. భార్యలను మార్చుకుంటూ..

Published On - 6:01 pm, Tue, 11 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu