Andhra Pradesh: హక్కుల కోసం పోరాటం చేస్తున్న తమ ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారంటూ పోలీసులకు మహిళాసంఘాలు ఫిర్యాదు..

Andhra Pradesh: సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. దానిని మంచి కోసం ఉపయోగించేవారున్నారు.. చెడుకు ఉపయోగించేవరున్నారు. ముఖ్యంగా మహిళల..

Andhra Pradesh: హక్కుల కోసం పోరాటం చేస్తున్న తమ ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారంటూ పోలీసులకు మహిళాసంఘాలు ఫిర్యాదు..
Social Media

Andhra Pradesh: సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. దానిని మంచి కోసం ఉపయోగించేవారున్నారు.. చెడుకు ఉపయోగించేవరున్నారు. ముఖ్యంగా మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్న సైబర్ నేరగాళ్ల గురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం.. తాము కూడా సైబర్ కేటుగాళ్ళ బాధితులమే అని మహిళా సంఘ నేతలు అంటున్నారు. ఈ మేరకు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు కూడా.. వివరాల్లోకి వెళ్తే..

ఆన్లైన్ లో హక్కుల కోసం పోరాడే మహిళ ల ఫోటోలు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం ప్రచారం చేయడం పై విజయవాడ సీపీకి మహిళా సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఘటన పై కేసు నమోదు చేసి కారకులను అరెస్ట్ చేయాలని ఐధ్వా రాష్ట్ర అధ్యక్షురాలు రమాదేవి డిమాండ్ చేశారు. అంతేకాదు పాస్టర్ పరంజ్యోతి అనే ఐడి తో ఉన్న ఫేస్ బుక్ పేజ్ లో మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి పెడుతున్నారన్నారు. హక్కుల కోసం పోరాడే వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి పెడుతున్నారని ఆరోపించారు. పెద్ద గ్రూప్ లా ఏర్పడి మహిళ ఫోటోలను ఆన్లైన్ లో పెట్టి అవమానించడమే కాకుండా మతాలను రెచ్చగొట్టేలా పోస్ట్ లు పెడుతున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ముస్లిం మహిళల ఫోటోలను సైతం పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి ఫేస్ బుక్ పేజీ లను వెంటనే బ్లాక్ చెయ్యాలి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read

Medaram Jatara: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి జాతరకు ఆర్టిసీ ప్రత్యేక బస్సులు.. చార్జీలు ఫిక్స్..

Published On - 2:38 pm, Tue, 11 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu