Raptadu Politics: రాప్తాడులో మళ్లీ రాజుకుంటున్న రాజకీయం.. తోపుదుర్తి బ్రదర్స్ – పరిటాల ఫ్యామిలీ మధ్య పేలుతున్న మాటలతూటాలు!

Topudurthi brothers vs Paritla Family: నిన్నటి వరకు వేరే యాంగిల్ ఉన్న రాప్తాడు ఫైట్ ఇప్పుడు ఆస్తుల చిట్టా చుట్టూ తిరుగుతోంది.

Raptadu Politics: రాప్తాడులో మళ్లీ రాజుకుంటున్న రాజకీయం.. తోపుదుర్తి బ్రదర్స్ - పరిటాల ఫ్యామిలీ మధ్య పేలుతున్న మాటలతూటాలు!
Thopudurthi Vs Paritala
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 11, 2022 | 2:32 PM

Raptadu Constituency Political Heat: రాజకీయాల్లోకి రాక ముందు మీకున్నది కేవలం 20ఎకరాలు.. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పమ్మా.. ఇదీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ మాజీ మంత్రి పరిటాల సునీతకు విసురుతున్న సవాళ్లు.. మేము అద్దె ఇంట్లో ఉంటున్నామని ఎగతాళి చేశారు.. అది నిజమే.. మరి మీలాగా హత్యలు బెదిరింపులతో సంపాదించుకోలేం కదా అని సెటైర్ వేస్తున్నారు. అంతేనా.. మీరు చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించండి.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. మరి నిరూపించలేకపోతే బహిరంగ క్షమాపణ చెప్తారా.. ఇలా పరిటాల సునీతకు తోపుదుర్తి బ్రదర్స్ వరుసగా విసురుతున్న సవాళ్లు.. మరి ఆ సవాళ్లకు సునీత రియాక్షన్ ఏంటి…

రాప్తాడు గడ్డపై నిన్నటి వరకు పంతం కోసం రాజకీయాలు చేశారు.. ఆధిపత్యం కోసం తగువులు పడ్డారు.. కానీ ఇప్పుడు సీన్ మారిందో లేక ట్రెండ్ మార్చారో తెలియదు కానీ.. వందలు వేల కోట్ల ఆస్తుల అంటూ రగడ రాజేస్తున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాప్తాడు దద్దరిల్లుతోంది. అసలు నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రాప్తాడు సడెన్ గా ఎందుకు ఈ గొడవ స్టార్ట్ అయిందంటే.. ఇటీవల టీడీపీ నేతలు గౌరవ సభల పేరుతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పరిటాల సునీత కూడా రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా కామన్ టార్గెట్ మాత్రం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బ్రదర్సే. నిన్నటివరకు సొంత ఇళ్లు లేక అద్దె ఇంట్లో ఉన్న తోపుదుర్తి బ్రదర్స్ ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తున్నారని.. రాప్తాడు నుంచి బెంగళూరు వరకూ భూదందాలు చేస్తున్నారని సునీత ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే దీనికి అటు వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.

కానీ తోపుదుర్తి బ్రదర్స్ ప్రెస్టేజ్ గా తీసుకున్న పాల డైరీ విషయంలో సునీత కామెంట్స్ మాత్రం వారికి కోపాన్ని తెప్పించాయి… డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా డైరీ ఏర్పాటు చేస్తామని చెప్పి డబ్బు వసూళ్లు చేశారని..ఇప్పుడు ఆ డబ్బును ప్రకాష్ రెడ్డి సోదరులు రియల్ ఎస్టేట్ కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. దీంతో బ్రదర్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక్కసారిగా పరిటాల కుటుంబం ఆస్తుల చిట్టాను తీసుకొచ్చి చదివారు. ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమాల పేరుతో కొండల్లో ఉన్న వారికి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, అనంతపురంలలో వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మాకు సొంత ఇళ్లు లేదని ఎగతాళి చేస్తారా.. మరి మీకు ఎక్కడి నుంచి అన్నిఆస్తులు వచ్చాయో చెప్పండి అంటూ ప్రకాష్ రెడ్డి సోదరుడు చందు ప్రశ్నించారు. మేము ఏదో సంపాదించుకున్నాం అంటున్నారు కదా.. అవి ఏవో చూపించండి ప్రజలకు పంచేస్తాం.. మేము కూడా మీ ఆస్తులు చూపిస్తాం అవి పంచే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఇటు ప్రకాష్ రెడ్డి కూడా సేమ్ డైలాగ్.. ఎన్నికల అఫడవిట్ లో ఎంతో ఆస్తి చూపించారు.. మీకు వాస్తవంగా ఉన్నవి ఎంతో లెక్కలు తీయండని సవాల్ విసిరారు…

మరోవైపు డ్వాక్రా మహిళల భాగస్వమ్యంతో ఏర్పాటు చేస్తున్న డైరీలో అక్రమాలు జరిగాయంటున్నారు… అందులో ఒక్క రూపాయి మేము కానీ అందులో సభ్యులు కానీ పక్కదారి పట్టించి ఉంటే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపించలేకపోతే మీరు రాజీనామాలు చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హత్యలు, దౌర్జన్యాలతో దోచుకోవడం దాచుకోవడం అనే విధానంతో పరిటాల రవి జీవించారని.. ఇప్పుడు మీరు మీకుటుంబసభ్యులు అదే పనిలో ఉన్నారని ప్రకాష్ రెడ్డి కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు…

నిన్నటి వరకు వేరే యాంగిల్ ఉన్న రాప్తాడు ఫైట్ ఇప్పుడు ఆస్తుల చిట్టా చుట్టూ తిరుగుతోంది. మరి ఆస్తులపై జరుగుతున్న ఈ సవాళ్లు పరిటాల కుటుంబం నుంచి ఎలా రియాక్షన్ రాలేదు. మొత్తం మీద నిన్నటి వరకు కూల్ గా కనిపించిన రాప్తాడులో అగ్గి ఒక్కసారి రాజుకుంది…

Read Also…  BrahMos Missile: భారత అమ్ములపొదలో మరో బ్రహాస్త్రం.. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం