Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paritala Sunita: నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా.. కీలక ప్రకటన చేసిన పరిటాల సునీత..

నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా అంటూ కీలక ప్రకటించారు  పరిటాల సునీత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తన బిడ్డను..

Paritala Sunita: నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా.. కీలక ప్రకటన చేసిన పరిటాల సునీత..
Paritala Sunitha
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 11, 2022 | 2:32 PM

Paritala Sunita – TDP: నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా అంటూ కీలక ప్రకటించారు  పరిటాల సునీత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తన బిడ్డను ఆశీర్వదించాలని ధర్మవరం ప్రజలకు విజ్ఙప్తి చేశారు. ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కదిరి పార్టీ ఇన్‌ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి దీనికి హాజరయ్యారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సునీత.. అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను పోటీ దింపారు. ఆ సమయంలో 25వేల ఓట్ల తేడాతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

అయితే దశాబ్ధాలుగా అనంతపురం రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న పరిటాల కుటుంబం ఈ సారి మాత్రం ధర్మవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. పరిటాల కుటుంబానికి పరిటాల శ్రీరామ్ రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు.

అయితే రాష్ట్రంలో మారిన సమీకరణాల్లో భాగంగా పరిటాల శ్రీరామ్.. ధర్మవరం నుంచి పోటీ చెయ్యాలనుకుంది. ఈ క్రమంలోనే తెలుగు దేశం పార్టీ అతనిని ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఈ క్రమంలోనే ధర్మవరం నియోజకవర్గంలో తల్లి పరిటాల సునీతతో కలిసి పరిటాల శ్రీరామ్ పర్యటించారు. ఇదే సందర్భంలో పరిటాల శ్రీరామ్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు తల్లి పరిటాల సునీత.

వేడెక్కిన అనంత రాజకీయాలు..

అనంతపురం జిల్లా రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. జిల్లా రాజకీయాలపై గట్టిపట్టు ఉన్న పరిటాల కుటుంబం అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతుండటమే ఈ తాజా ప్రకటనకు కారణం. ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు ప్రమేయం లేకుండానే అసెంబ్లీ స్థానాలను సెలెక్ట్ చేసుకుందనే ప్రచారం జిల్లాలో ఉంది.

అనంతరం ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్‌గా మారడంతో ఈ నియోజకవర్గాన్ని పరిటాల కుటుంబం వీడాల్సి వచ్చింది. 2009లో ఎస్సీ రిజర్వుడ్ కావడంతో బీకే పార్థసారథి టీడీపీ నుంచి రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం ఈ స్థానంపై వైసీపీ గెలిచింది.

పెనుకొండ ఎస్సీ రిజర్వుడ్‌గా మారడంతో పరిటాల కుటుంబం.. రాప్తాడు నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి పరిటాల సునీత ఈ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

అయితే.. 2019 ఎన్నికల్లో పరిటాల సునీత పోటీ చేయలేదు. తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను ఎన్నికల బరిలో నిలిపారు. అక్కడ ఫలితాలు తిరగబడటంతో.. తన అరంగేట్రం ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ దారుణంగా పరాజయాన్ని చవి చూశారు. 25 వేలకు పైగా ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి: Renu Desai: రేణు దేశాయ్, అకిరాకు కోవిడ్ పాజిటివ్.. థర్డ్ వేవ్ సీరియస్‏గా తీసుకోండి అంటూ పోస్ట్..

Telangana: ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపిన CRPF జవాన్.. ఏం జరిగిందంటే