Telangana: ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపిన CRPF జవాన్.. ఏం జరిగిందంటే

కన్నతండ్రే కాలయముడయ్యాడు.. భార్య భర్తల మధ్య కలహాల కుదుపుల నేపథ్యంలో అభం శుభం ఎరుగని ఇద్దరు పిల్లల ప్రాణాలు మింగేశాడు.

Telangana: ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపిన CRPF జవాన్.. ఏం జరిగిందంటే
Representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 11, 2022 | 1:40 PM

కన్నతండ్రే కాలయముడయ్యాడు.. భార్య భర్తల మధ్య కలహాల కుదుపుల నేపథ్యంలో అభం శుభం ఎరుగని ఇద్దరు పిల్లల ప్రాణాలు మింగేశాడు.. హాయిగా ఆడుకుంటున్న తన కొడుకు- కూతురును తీసుకెళ్లి జల సమాధి చేశాడు.. ఈ దారుణానికి పాల్పడిన ఆ కిరాతకుడు CRPF జవాన్ కావడం గమనార్హం.

ఈ దారుణ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్ అనే CRPF జవాన్ తన ఇద్దరు కన్నబిడ్డలను కడతేర్చాడు.. అత్యంత కిరాతకంగా వారిని వ్యవసాయబావిలో పడేసి కడ తేర్చాడు. పండుగ సెలవులు కావడంతో ఇంటివద్ద ఆడుకుంటున్న తన ఇద్దరుబిడ్డలను నమ్మించి వ్యవసాయ బావివద్దకు తీసుకెళ్లాడు. కొడుకు-కూతురు అమ్మిజాక్సన్- జానీబేస్టోను వ్యవసాయబావిలోకి నెట్టిపడేసి హత్యచేశాడు. వారికి గోరుముద్దలు తినిపించిన ఆ చేతులతోనే గోతిలోకి నెట్టేశాడు.. ఇరుగు-పొరుగు వారంతా అక్కడికి చేరుకొని పిల్లల్ని బయటకు తీసేలోపే వారు తనువు చాలించారు. కాగా పిల్లల్ని బావిలోకి తోసేసి.. రామ్ కుమార్ అక్కడినుంచి పారిపోయాడు.

పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కాలయముడై ప్రాణాలు మింగేయడం ప్రతి ఒక్కరి హృదయాన్ని తల్లడిల్లిపోయేలా చేసింది.. ఈ దారుణానికి పాల్పడిన తండ్రి రామ్ కుమార్ ప్రస్తుతం ముంబైలో CRPF  జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.. భార్య శిరీషతో కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో మానవ మృగంలా మారి కొడుకు బర్త్ డే కు ముందే ప్రాణాలు మింగేశాడు.. ఆ కిరాతకుడు పరారీలో ఉన్నాడు.. కన్నతల్లి గుండెలవిసేలా రోధిస్తుంది.. ఆ తండా వాసులు తల్లడిల్లిపోతున్నారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Deaths

తండ్రి చేతిలో హత్యకు గురైన పిల్లలు

-జీ. పెద్దేష్, టీవీ9 తెలుగు 

Also Read: పండక్కి పిండివంటలు వండుతున్నారా.. అయితే మీకే ఈ అలర్ట్

పదే, పదే ఎన్​-95 మాస్కులు కొనాల్సిన పనిలేదు.. ఇలా క్లీన్ చేస్తే పాతికసార్లు వాడొచ్చు!