Renu Desai: రేణు దేశాయ్, అకిరాకు కోవిడ్ పాజిటివ్.. థర్డ్ వేవ్ సీరియస్‌గా తీసుకోండి అంటూ పోస్ట్..
గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే.
గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ పరిశ్రమను కరోనా ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్, మంచు లక్ష్మి, మంచు మనోజ్, త్రిష, రాజేంద్రప్రసాద్, సత్యరాజ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్.. నటి రేణు దేశాయ్ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.
అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉన్నప్పటికీ నేను, అకీనా కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజులుగా లక్షణాలు కనిపించగా.. పరీక్షలు చేస్తే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేం కోలుకుంటున్నాం. నేను ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాను.. అయినప్పటికీ కరోనా వచ్చింది. అకీరాకు వ్యాక్సిన్ వేయిద్దాం అనుకునే లోపే అతడికి కరోనా వచ్చింది. థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకుని మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి అంటూ రేణూ దేశాయ్ పోస్ట్ చేశారు.
View this post on Instagram
Also Read: Akhanda Movie: జై బాలయ్య ఫుల్ సాంగ్ వచ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హల్చల్..
Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..
Balakrishna: మంత్రి హరీష్ రావును కలిసిన బాలకృష్ణ.. ఏ అంశాలపై చర్చించారంటే..