AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavana: దాడి జరిగిన ఐదేళ్ల తర్వాత హీరోయిన్ రియాక్షన్.. తప్పు చేసినవారికి శిక్ష పడేవరకు పోరాడుతానంటూ..

ప్రముఖ దక్షిణాది హీరోయిన్ భావన తనపై జరిగిన దాడి ఘటనపై స్పందించింది. భావనపై లైంగిక వేధింపుల కేసులో ప్రధాన

Bhavana: దాడి జరిగిన ఐదేళ్ల తర్వాత హీరోయిన్ రియాక్షన్.. తప్పు చేసినవారికి శిక్ష పడేవరకు పోరాడుతానంటూ..
Bhavana
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2022 | 11:42 AM

Share

ప్రముఖ దక్షిణాది హీరోయిన్ భావన తనపై జరిగిన దాడి ఘటనపై స్పందించింది. భావనపై లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మలయాళ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ పై కేరళ పోలిసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి నుంచి సూపర్ స్టార్ దీలిప్ కుమార్ పేరు ప్రధానంగా వినిపించడంతో ఆయనను అరెస్ట్ చేశారు కేరళ పోలీసులు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసు ఇంకా కొనసాగుతునే ఉంది.

తాజాగా దిలీప్ కుమార్ అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్ తోపాటు.. ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. తాజాగా ఘటన జరిగిన హీరోయిన్ భావన స్పందించారు తనకు జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకుని సోషల్ మీడియాలో సుధీర్ఘపోస్టును షేర్ చేసింది.

“ఇది అంత తేలికైన ప్రయాణం కాదు. బాధితురాలి నుంచి ప్రాణాలతో బయటపడే ప్రయాణం. ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి బరువుతో నా పేరు, నా గుర్తింపు అణచివేయబడింది. నేరం చేసింది నేను కాదు.. అయినా నన్ను అవమానపరచడానికి.. మౌనంగా ఉంచడానికి.. ఒంటరిగా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అలాంటి సమయంలో నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా గొంతులు వింటున్నాను. న్యాయం కోసం ఈ పోరాటంలో నేను ఒంటరిగా లేనని నాకు తెలుసు. న్యాయం గెలవాలని.. తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను ఈ ప్రయాణం కొనసాగిస్తాను. నాతోపాటు నిలబడిన వారందరికీ మీ ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు ” అంటూ రాసుకోచ్చింది భావన.

తెలుగులో మహాత్మ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది భావన. దాడి జరిగిన తర్వాత భావనకు ఆఫర్లు అంతగా రాలేదు. ఆ తర్వాత భావన నవీన్‏ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం కన్నడ సినిమాల్లో బిజీగా ఉంది భావన.

Also Read: Akhanda Movie: జై బాల‌య్య ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హ‌ల్చ‌ల్‌..

Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..

Balakrishna: మంత్రి హ‌రీష్ రావును క‌లిసిన బాల‌కృష్ణ‌.. ఏ అంశాల‌పై చ‌ర్చించారంటే..