Medaram Jatara: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి జాతరకు ఆర్టిసీ ప్రత్యేక బస్సులు.. చార్జీలు ఫిక్స్..

Medaram Jatara:ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహా సమ్మేళం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. మేడారం జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో..

Medaram Jatara: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి జాతరకు ఆర్టిసీ ప్రత్యేక బస్సులు.. చార్జీలు ఫిక్స్..
Rtc
Follow us

|

Updated on: Jan 11, 2022 | 2:09 PM

Medaram Jatara:ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహా సమ్మేళం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. మేడారం జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం వెళ్ళే సమ్మక్క, సారలమ్మ భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి మేడారానికి ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. ఈరోజు నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ చెప్పారు.

దీంతో ఈరోజు నుంచి మేడారం వెళ్ళే భక్తులకు ఆర్టీసీ బస్సులు ప్రతి రొజూ అందుబాటులో ఉండనున్నాయి. ఈ బస్సులు ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారంకు బయల్దేరతాయి. తిరిగి సాయంత్రం 4 గంటలకు మేడారం నుంచి హన్మకొండకు చేరుకుంటాయి. అంతేకాదు ఈ బస్సు చార్జీలను కూడా నిర్ణయించింది. పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ స్పష్టం చేశారు. బస్సుల్లో ప్రయాణించే అమ్మవారి భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని ప్రయాణీకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి రెండేళ్ళకి ఒకసారి జరుపుకునే ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లను ఘనంగా చేస్తోంది. ఇప్పటికే కరోనా నిబంధనలు అనుసరిస్తూ.. పనులను పూర్తీ చేస్తున్నారు.

Also Read:

 మీరు ఆ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఇక నుంచి బాదుడే బాదుడు..

 వంజంగి హిల్స్‌లో ఆహ్లాదాన్ని ఇచ్చే ప్రకృతి అందాలు.. బారులు తీరిన పర్యాటకులు

పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!

'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!

HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!