Vanjangi: వంజంగి హిల్స్‌లో ఆహ్లాదాన్ని ఇచ్చే ప్రకృతి అందాలు.. బారులు తీరిన పర్యాటకులు

Vanjangi in Visakha: విశాఖ జిల్లా అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు..మన్యం ప్రాంతాలైన పాడేరు, వంజంగి హిల్స్‌లో అబ్బుర పరిచే రమణీయ దృశ్యాలు చూపరులను..

Vanjangi: వంజంగి హిల్స్‌లో ఆహ్లాదాన్ని ఇచ్చే ప్రకృతి అందాలు.. బారులు తీరిన పర్యాటకులు
Vanjangi Tourist Place
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2022 | 1:27 PM

Vanjangi in Visakha: విశాఖ జిల్లా అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు..మన్యం ప్రాంతాలైన పాడేరు, వంజంగి హిల్స్‌లో అబ్బుర పరిచే రమణీయ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో భారీ స్థాయిలో పర్యాటకులు పాడేరు ఏజెన్సీకి పోటెత్తుతున్నారు. ప్రతిరోజూ సూర్యోదయం కాగానే కళ్ళ ముందు సాక్షాత్కరించే మంచు దుప్పటి, చేతికి అందేంత దూరంలో తేలియాడే మబ్బులు, చుట్టుపక్కల ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. వంజంగి కొండల పైనుంచి సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు. శని,ఆది వారాలకు తోడు సంక్రాంతి శెలవులు కలిసి రావడంతో చిన్నా, పెద్దతో పాటు అధిక సంఖ్యలో యువత ఛలో పాడేరు అంటున్నారు.

వంజంగి హిల్స్ తో పాటు సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తున ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం ప్రకృతి ప్రియులకు స్వర్గధామంగా మారింది. మారుమూల ఏజెన్సీలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఏడాది వ్యవధిలో రెండు లక్షల మంది పర్యాటకులు సందర్శించి వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. శీతకాలం వచ్చిందంటే చాలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గిరిజన పల్లెలకు వంజంగి హిల్స్ పర్యాటక కేంద్రంగా గిరిజనులకు జీవనోపాధి సైతం కల్పిస్తోంది.

Read Also:

 ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినం.. మాస్క్ లేని వారిని అనుమతిస్తే.. షాప్ యజమానికి భారీగా ఫైన్

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..