AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona Virus: ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినం.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

AP Night Curfew: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కరోనా కేసులు భారీ పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయింది. కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు కఠిన తరం చేసింది. అంతేకాదు..

AP Corona Virus: ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినం.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
Ap Night Curfew
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2022 | 12:54 PM

AP Night Curfew: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కరోనా కేసులు భారీ పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయింది. కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు కఠిన తరం చేసింది. అంతేకాదు ఏపీలో నైట్ కర్ఫ్యూ ని విధించింది. తాజాగా నైట్ కర్ఫ్యూ నిబంధనలు విడుదల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెలాఖరు వరకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిత్యావసర వస్తువులు, వైద్య చికిత్స వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి, ఇండోర్ 100 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. అయితే సంక్రాంతి పండగ ను దృష్టిలో ఉంచుకుని అంతరాష్ట్ర రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఇక సినిమా సినిమా థియేటర్లలో సీటుకు మధ్య గ్యాప్ ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అంటే 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లలో సినిమాలను ప్రదర్శించుకోవడానికి అనుమతినిచ్చింది. ప్రజా రవాణాలో ప్రయాణికులు, సిబ్బందికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. షాపింగ్ మాల్స్, దుకాణాల్లోకి వినియోగదారుడు తప్పని సరిగా మాస్క్ ధరించి వెళ్ళాలని తెలిపింది. ఒకవేళ మాస్క్ ధరించని వినియోగాదారుడిని షాపుల్లోకి అనుమతినిచ్చే.. ఆ షాప్ నిర్వాహకులకు గరిష్టంగా రూ. 25,000 జరిమానా విధించానున్నామని తెలిపింది.

ప్రార్ధనా మందిరాల్లో కోవిడ్ నిభందనలు తప్పనిసరి సూచించింది. ఒకవేళ మాస్క్ ధరించకుండ బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారికి రూ. 100 రూపాయలు జరిమానా విధించడమే కాదు.. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

Also Read:   రైలు పట్టాలపై విమానం ఎమర్జెన్సీ లాండింగ్‌… ఢీ కొట్టిన ట్రైన్.. వీడియో వైరల్‌