Mudragada Padmanabham: మీరు తిడుతున్నారని నాకున్న బలమైన ఆలోచనలను వదిలిపెట్టను.. లేఖలో ముద్రగడ పద్మనాభం
Mudragada Padmanabham: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు...
Mudragada Padmanabham: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. జగ్గంపేట ప్రజలకు ముద్రగడ రాసిన లేఖలో.. ఇటీవల తన లేఖపై వస్తున్న కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య నేను రాసిన లేఖలకు చాలా మంది పెద్దలు భుజాలు తడుముకుంటున్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి దళిత,బీసీ నాయకులు మూడవ ప్రత్యామ్నాయం గురించి చర్చిస్తున్నారు. మా కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్ఓల ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తోంది. ముఖ్యమంత్రి అవుతానంటే కోట్లు ఖర్చు పెట్టే స్నేహితులున్నారు. అలా ఖర్చు చేసి పదవులు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ మధ్య భుజాలు తడుముకునే వారు సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు. ప్రముఖుల గురించి ఒక మాట రాస్తే తప్పుగా చిత్రీకరిస్తున్నారు. .
వారి పోస్టింగులకు బెదిరిపోయి పారిపోతాను అనుకుంటున్నారేమో, ఎట్టి పరిస్థితుల్లో బెదరను అంటూ లేఖలో చెప్పుకొచ్చారు ముద్రగడ. ప్రజలకు చేసే సేవలో ఎప్పుడూ ఫలితం ఆశించని మనిషినండి. ప్రయత్నాలు విఫలం లేక సఫలం కావచచు. నేను ఎన్‌ఆర్‌ఐని కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టాను. బంతిని ఎంతగట్టిగా కొడితే అంత స్పీడుగా పైకిలేస్తుంది.. నాకున్న బలమైన ఆలోచనలు మీరు తిడుతున్నారని వదిలిపెట్టను, ఎవరి కోసం త్యాగం చేయను. నా న్యాయమైన ఆలోచనలు, అభిప్రాయాలు అమలు చేయవద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదండి అంటూ లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: