Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ పాము చాలా డేంజర్.. దీని వేట మాములుగా ఉండదు.. దొరికితే జ్యూస్‌లా చేసి తాగేస్తుంది!

మీరెప్పుడైనా సుత్తి తల పాము గురించి విన్నారా.. ఈ పేరే విచిత్రంగా ఉంది కదా.. ఎందుకంటే ఆ పాము...

Viral Video: ఈ పాము చాలా డేంజర్.. దీని వేట మాములుగా ఉండదు.. దొరికితే జ్యూస్‌లా చేసి తాగేస్తుంది!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 10, 2022 | 5:55 PM

మీరెప్పుడైనా సుత్తి తల పాము గురించి విన్నారా.. ఈ పేరే విచిత్రంగా ఉంది కదా.. ఎందుకంటే ఆ పాము తల మేకులు కొట్టే సుత్తిలాగా ఉంటుంది. అందుకే దాన్ని అలా పిలుస్తారు. చూడ్డానికి చిన్నదే కానీ చాలా డేంజర్‌.. నెమ్మదిగా పాకుతుంది.. దాని శత్రువుల్ని క్షణాల్లో నీరులా మార్చేసి తాగేస్తుంది. ఇది దీని వేట పద్ధతి. జనరల్‌గా ఈ పాము… వానపాముల్ని తింటుంది.. వానపాముని చూడగానే… ఓ రకమైన ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇదో రకమైన అత్యంత విషపూరితమైన రసాయనం. ఈ రసాయనం తగలగానే… వానపాము ద్రవంలా మారిపోతుంది. అంతే వెంటనే సుత్తి తల పాము… వానపామును పీల్చేసుకుంటుంది. ఇందుకోసం ఈ పాములో ద్రవాలను లాక్కునే కణజాలాలు ఉంటాయి. అవి మెల్లగా పీల్చేస్తాయి. ఈ పాము మనుషులు, పక్షులు, జంతువులకు ఎలాంటి హాని చెయ్యదు. అందువల్ల దీంతో మనకు డైరెక్టుగా ఎలాంటి సమస్యా లేదు.

కానీ ఇవి మనకు పరోక్షంగా హానికరమనే చెప్పాలి. ఎందుకంటే మనకు వానపాములు చాలా ముఖ్యమైనవి. అవి భూమిని గుల్లలుగా చేస్తూ… మొక్కలకు కావాల్సిన పోషకాలు అందేందుకు ఎంతో సాయపడతాయి. అలాంటి వానపాముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అందుకే ఈ సుత్తి తల పాము కనిపిస్తే వెంటనే చంపేయడమే మేలు. ఇవి మన దేశంలో అంతగా కనిపించవు కానీ అమెరికా, యూరప్ ఖండాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడి వారు ఈ పాముల్ని చంపుతున్నా… తరచూ ఇవి వస్తూనే ఉన్నాయి. ఇవి తమ ఖండాలపై దండయాత్ర చేస్తున్నాయని అక్కడి పరిశోధకులు అంటున్నారు. ఇవి ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయో తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు.

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
ICL ఫిన్‌కార్ప్‌ను నేషనల్ లెండింగ్ పార్టనర్‌గా నియమించిన NIDCC
ICL ఫిన్‌కార్ప్‌ను నేషనల్ లెండింగ్ పార్టనర్‌గా నియమించిన NIDCC
బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో
బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో
రాయుడిని లైవ్‌లో ట్రోల్ చేసిన గబ్బర్
రాయుడిని లైవ్‌లో ట్రోల్ చేసిన గబ్బర్
అమ్మాయి చేతులు చూసి మండపం నుంచి వరుడు జంప్..!
అమ్మాయి చేతులు చూసి మండపం నుంచి వరుడు జంప్..!
నిజమా? మే ఒకటి నుంచి ఫాస్టాగ్ పనిచేయదా?మరీ టోల్ ప్లాజాల సంగతేంటి?
నిజమా? మే ఒకటి నుంచి ఫాస్టాగ్ పనిచేయదా?మరీ టోల్ ప్లాజాల సంగతేంటి?
ఎలుకల్ని తరిమి కొట్టేందుకుఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు!
ఎలుకల్ని తరిమి కొట్టేందుకుఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు!
UPSC సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే
UPSC సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే
మీ కిడ్నీల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.. ఇవి తినడం మర్చిపోకండి
మీ కిడ్నీల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.. ఇవి తినడం మర్చిపోకండి
ఈ 10 విషయాలు తెలిస్తే కష్టం మీ కాంపౌండ్ వాల్ దాటదు!
ఈ 10 విషయాలు తెలిస్తే కష్టం మీ కాంపౌండ్ వాల్ దాటదు!