Viral Video: రెస్టారెంట్‌లోకి దూసుకొచ్చిన దున్నపోతు.. వ్యక్తిని గాల్లోకి ఎగరేసి.. చూస్తే షాకవుతారంతే.!
సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తే..
సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని వణుకు పుట్టించే విధంగా ఉంటాయి. సరిగ్గా ఈ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అనూహ్యంగా ఓ దున్నపాటు రెస్టారెంట్‌లోకి ప్రవేశించి రచ్చ.. రచ్చ చేసింది. అదేంటో చూసేయండి..
ఒక రెస్టారెంట్‌లో ఊహించని సంఘటన ఎదురైంది. ఓ వక్తి తృటిలో మృత్యువునుంచి తప్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే.. చైనాలోని జిన్హువాలో ఒక రెస్టారెంట్‌లోకి దున్నపోతు దూసుకొచ్చింది. ఆ సమయంలో రెస్టారెంట్‌లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఓ వ్యక్తి నీళ్లు తాగుతూ ఉన్నాడు. ఇంతలో ఊహించని విధంగా రెస్టారెంట్‌లోకి దూసుకొచ్చని దున్న ఆ వ్యక్తిని దాని కొమ్ములతో గాల్లోకి ఎగరేసి కుమ్మేసింది. ఈ దాడిలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి అతడిని కాపాడి వేరీ గదిలోకి తీసుకెళ్లాడు. ఇంతలో స్థానికులు అక్కడికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఆ రెస్టారెంట్‌లో దున్న చేసిన దాడి ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తూర్పు చైనా నగరం తైజౌలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడికి దగ్గర్లోనే ఉన్న కబేళా సెంటర్ నుంచి దున్న తప్పించుకొని పారిపోయినట్లు తెలిసింది. గాయపడిన వ్యక్తికి ఆ దున్నకు చెందిన యజమాని పరిహారం చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలిసింది.
View this post on Instagram