Head Injury: ఎప్పుడైనా తలకు గాయమైతే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. వీరికి భవిష్యత్తులో ఆ వ్యాధుల ప్రమాదం ఎక్కువట

ఎప్పుడైనా అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తలకు తీవ్రమైన గాయాలు జరుగుతాయి. ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటే ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. అదృష్టం బాగుంటే గాయాలతో బయటపడటం కూడా జరుగుతుంది. ఇలా తలకు గాయాలు తగిలినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇటువంటి వారిలో ట్రామా వ్యాధి ప్రమాదం 30 నుంచి 40 శాతం ఎక్కువట. తలకు చిన్న గాయం..

Head Injury: ఎప్పుడైనా తలకు గాయమైతే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. వీరికి భవిష్యత్తులో ఆ వ్యాధుల ప్రమాదం ఎక్కువట
Head Injury
Follow us

|

Updated on: Apr 04, 2024 | 9:02 PM

ఎప్పుడైనా అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తలకు తీవ్రమైన గాయాలు జరుగుతాయి. ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటే ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. అదృష్టం బాగుంటే గాయాలతో బయటపడటం కూడా జరుగుతుంది. ఇలా తలకు గాయాలు తగిలినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇటువంటి వారిలో ట్రామా వ్యాధి ప్రమాదం 30 నుంచి 40 శాతం ఎక్కువట. తలకు చిన్న గాయం అయినా దానిని సీరియస్‌గా తీసుకోవాలని చెబుతున్నారు. గాయం కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టినట్లయితే, అది బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతుంది. ఇది మరణానికి కూడా కారణమవుతుంది. అందుకే తలకు గాయాలైతే సకాలంలో ప్రథమ చికిత్స అందించడం చాలా ముఖ్యం. కానీ చాలా సందర్భాలలో తలకు గాయం అయినప్పుడు ఏమి చేయాలో చాలా మందికి తెలియదు. తలకు గాయమైన తర్వాత ప్రథమ చికిత్స ఏమి చేయాలి, ఏ విషయాలను గుర్తుంచుకోవాలి వంటి విషయాలు మీ కోసం..

తలకు గాయమైన తర్వాత సరైన సమయంలో ప్రథమ చికిత్స అందిస్తే రోగి బతికే అవకాశాలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స గురించి తెలుసుకోవాలి. ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్‌లోని న్యూరో సర్జరీ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ దల్జీత్ సింగ్ మాటల్లో.. తలకు గాయం అయిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందో లేదో చూడాలి. రోగికి ఈ సమస్య ఉంటే, అతనికి వెంటనే సీపీఆర్‌ ఇవ్వాలి. CPR గుండెపోటు లేదా గుండె ఆగిపోయిన సందర్భాల్లో మాత్రమే కాకుండా తల గాయం తర్వాత శ్వాసకోశ సమస్య తలెత్తినప్పుడు కూడా ఇవ్వాలి. CPR ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చు. తల నుండి రక్తస్రావం జరిగితే ముందుగా దానికి డ్రెస్సింగ్ చేయాలి. గాయపడిన ప్రదేశంలో ఒక గుడ్డను కట్టి రక్తాస్రావం జరగకుండా నివారించాలి. గాయం తల పైన ఉంటే, వ్యక్తి భుజాలు, తల పైకి ఉండేలా పెట్టాలి. దీనివల్ల రక్తస్రావం తగ్గుతుంది. రోగి చుట్టూ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ రోగి అపస్మారక స్థితికి చేరుకున్నట్లయితే, అస్పష్టమైన దృష్టి, మైకము కమ్మినట్లు ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తీవ్రమైన తలనొప్పితో పాటు మూర్ఛ కూడా సంభవిస్తే, పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు భావించాలి. ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

తలకు గాయమైన 6 గంటల లోపు ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఇంతకు మించిన ఆలస్యం అయితే రోగి పరిస్థితి మరింత దిగజార్చవచ్చు. తలకు ఇలాంటి బలమైన గాయాలు తగిలితే భవిష్యత్తులో స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. గాయం నయమైన తర్వాత కూడా తేలికపాటి నొప్పి ఉంటే CT స్కాన్ చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల తల లోపల ఎలాంటి సమస్య వచ్చినా సకాలంలో గుర్తించి చికిత్స కూడా చేయడానికి వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.