AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heat Wave: వేసవిలో వీచే వడగాలులు నిజంగా ప్రాణాంతకమా? మరైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ఏప్రిల్ నెల ప్రారంభంలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. దీంతో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. వేడిగాలుల కారణంగా ప్రతి యేట ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు హీట్ వేవ్ కూడా ఒక ప్రధాన కారణం...

Heat Wave: వేసవిలో వీచే వడగాలులు నిజంగా ప్రాణాంతకమా? మరైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Heat Wave
Srilakshmi C
|

Updated on: Apr 04, 2024 | 8:44 PM

Share

ఏప్రిల్ నెల ప్రారంభంలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. దీంతో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. వేడిగాలుల కారణంగా ప్రతి యేట ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు హీట్ వేవ్ కూడా ఒక ప్రధాన కారణం. 1998-2017 వరకు వేడి గాలుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1,66,000 మందికి పైగా మరణించారని నివేదించింది. వాతావరణ మార్పుల కారణంగా ఎండదెబ్బ తగులుతుంది. WHO 2020 నివేదిక ప్రకారం.. 2000 – 2016 మధ్య వడదెబ్బ కారణంగా ప్రభావితమైన వారి సంఖ్య సుమారు 125 మిలియన్లుగా పేర్కొంది. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు వేడిగాలుల కారణంగా మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

వడగాలులు అంటే ఏమిటి? అది ఏ విధంగా మరణానికి కారణం అవుతుంది?

సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే వేడి గాలులు వీయడం ప్రారంభిస్తాయి. దీనినే హీట్ వేవ్ లేదా వడగాలులు అంటారు. ఇటువంటి ఉష్ణోగ్రతలలో ఎవరైనా నిరంతరంగా బయట ఉంటే, వారికి హీట్ స్ట్రోక్‌ తగిలే ప్రమాదం ఉంది. దీంతో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. కొందరు వ్యక్తులు తీవ్రమైన తలనొప్పితో పాటు మైకం కమ్మడం, వాంతులు చేసుకుంటారు. సాధారణంగా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల్లో మూడు నుంచి నాలుగు గంటలపాటు నిరంతరం ఉంటే ఎండ వేడిమి ప్రభావం శరీరంలో కనిపించడం ప్రారంభిస్తుంది. ఈ లక్షణాలకు సకాలంలో చికిత్స చేయకపోతే, హీట్ స్ట్రోక్ మరణానికి దారి తీస్తుంది.

హీట్ వేవ్ ప్రాణాంతకమా?

లేడీ హార్డింజ్ హాస్పిటల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడి డాక్టర్ ఎల్ హెచ్ ఘోటేకర్ ఏం చెబుతున్నారంటే.. వేడిగాలులు మరణానికి దారి తీస్తుంది. వేడి తరంగాల కారణంగా గుండె ఆగిపోతుంది. అధిక వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి శరీరం ఎక్కువ రక్తాన్ని పంప్ చేయాల్సి ఉంటుంది. దీంతో గుండె బిపిని నిర్వహించడానికి చాలా కష్టపడాలి. దీంతో గుండెపై ఒత్తిడి పడి గుండె కొట్టుకోవడం నిమిషానికి 100 దాటుతుంది. గుండె కొట్టుకోవడం ఆకస్మికంగా పెరగడం వల్ల గుండె ఆగిపోతుంది. ఇది మరణానికి కారణం కావచ్చు.

ఇవి కూడా చదవండి

వడ దెబ్బ

హీట్ వేవ్ కారణంగా మరణానికి రెండవ అతిపెద్ద కారణం హీట్ స్ట్రోక్. అధిక వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది. చెమట సరిగా బయటకు రాలేక శరీరం చల్లగా ఉండలేకపోతుంది. దీంతొ శరీర ఉష్ణోగ్రత 10 నుంచి 13 నిమిషాలలో 106 డిగ్రీల ఫారెన్‌ హీట్‌కి చేరుతుంది. ఫలితంగా హీట్ స్ట్రోక్ సంభవిస్తుంది. చాలా సందర్భాలలో వ్యక్తి మరణం కూడా సంభవిస్తుంది.

మూత్రపిండ వైఫల్యం

అధిక వేడి కారణంగా, అధిక చెమట ఏర్పడుతుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందని డాక్టర్ ఘోటేకర్ అంటున్నారు. ఇలాంటి సమయంలో నీరు త్రాగకపోతే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీని కారణంగా, మూత్రపిండాల పనితీరు దెబ్బతిని, ఫెయిల్‌ అవుతాయి.

ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి?

హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే.. ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి, అధిక చెమట, తల తిరగడం, కండరాల నొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. దీని నుంచి బయటపడాలంటే.. ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి. ప్రతి గంటకు నీరు త్రాగుతూ ఉండాలి. ఎండలో వెళ్లినప్పుడు తలను కవర్‌ చేసుకోవాలి. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ORS ద్రావణాన్ని తాగుతూ ఉండాలి. నారింజ, పుచ్చకాయ వంటి పండ్లను తినాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.