Chia Seeds for Weight Loss: చియా సీడ్స్ ని ఇలా తీసుకోండి.. ఇట్టే బరువు తగ్గిపోతారు!
ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది ఊబ కాయంతో బాధ పడుతున్నారు. అధిక బరువు కారణంగా నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అలాగే వ్యాయామాలు చేస్తున్నా.. పూర్తిగా ఫలితాలు అందడం లేదు. బరువు తగ్గాలనుకునే వారు ఆహార నియమాలపై కూడా ఫోకస్ చేయాలి. అప్పుడే బరువు తగ్గుతారు. మీకు శక్తిని అందిస్తూ.. బరువు తగ్గించే ఆహారాలు తీసుకుంటే. ఇలా చేస్తే కనుకు మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బరువును తగ్గించడంలో చీయా సీడ్స్..
ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది ఊబ కాయంతో బాధ పడుతున్నారు. అధిక బరువు కారణంగా నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అలాగే వ్యాయామాలు చేస్తున్నా.. పూర్తిగా ఫలితాలు అందడం లేదు. బరువు తగ్గాలనుకునే వారు ఆహార నియమాలపై కూడా ఫోకస్ చేయాలి. అప్పుడే బరువు తగ్గుతారు. మీకు శక్తిని అందిస్తూ.. బరువు తగ్గించే ఆహారాలు తీసుకుంటే. ఇలా చేస్తే కనుకు మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బరువును తగ్గించడంలో చీయా సీడ్స్ బాగా హెల్ప్ చేస్తాయ. వీటిని కనుక రెగ్యులర్ గా మీ ఆహారంలో చేర్చుకుంటే మాత్రం.. మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మరి చియా సీడ్స్ ఏ విధంగా వెయిల్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చియా సీడ్స్ లో పోషకాలు:
చియా సీడ్స్ లో ఫైబర్, ప్రోటీన్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాపర్ , పొటాషియం వంటి పోషకాలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
జంక్ ఫుడ్స్ తినలేరు:
చియా సీడ్స్ ని మీ డైట్ లో వివిధ భాగాలు చేసుకోండి. చియా సీడ్స్ ని సలాడ్స్ లో, స్నాక్స్ లో, జ్యూస్ లలో ఇలా వేటితో అయినా కలిపి తీసుకోవచ్చు. అంతే కాకుండా వీటిని కొద్దిగా తిన్నా.. కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇతర ఆహార పదార్థాలను తీసుకోలేరు. కాబట్టి త్వరగా బరువు తగ్గే వీలుంది.
నిమ్మ రసంతో తీసుకోవచ్చు:
చియా సీడ్స్ ని రాత్రికి నానబెట్టి ఉదయం నిమ్మ రసంతో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఉదయం నాన బెట్టి.. సాయంత్రం సలాడ్స్, జ్యూస్ లతో కలిపి తాగవచ్చు.
గంజితో కలిపి కూడా తాగవచ్చు:
ఊబకాయం తగ్గాలంటే.. చియా సీడ్స్ ని గంజిలో కూడా కలుపుకుని తీసుకోవచ్చు. గంజి కూడా బరువును తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. గంజిలో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. అందులోనూ వాటర్ కంటెంట్ కాబట్టి.. ఒక గ్లాస్ గంజిలో చియా సీడ్స్ కలిపి తాగితే.. రెండు గంటల వరకూ కడుపు ఫుల్ గా ఆకలి వేయకుండా ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.