Side effects of Lack of Sleep: సరిగ్గా నిద్ర పోవడం లేదా.. అయితే ఈ ప్రాణాంతక వ్యాధుల ముప్పు తప్పదు!
ఏది ఉన్నా లేకపోయినా.. సరైన నిద్ర లేకపోతే మాత్రం దీర్ఘకాలిక వ్యాధుల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా నిద్ర పోవడానికి కూడా సరైన సమయం ఉండటం లేదు. దానికి తోడు ఉన్న సమయంలో కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ సగం లైఫ్ గడిపేస్తూ.. నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి శరీరానికి సరైన నిద్ర లేకపోతే మానసికంగా, శారీరకంగా కలిగే నష్టాలు ఏంటి? ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఎలాంటి..

ఏది ఉన్నా లేకపోయినా.. సరైన నిద్ర లేకపోతే మాత్రం దీర్ఘకాలిక వ్యాధుల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా నిద్ర పోవడానికి కూడా సరైన సమయం ఉండటం లేదు. దానికి తోడు ఉన్న సమయంలో కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ సగం లైఫ్ గడిపేస్తూ.. నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి శరీరానికి సరైన నిద్ర లేకపోతే మానసికంగా, శారీరకంగా కలిగే నష్టాలు ఏంటి? ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగ నిరోధక శక్తి తగ్గి పోతుంది:
సరైన వేళకు నిద్ర పోకపోతే ముందు మనసు, మెదడు తీవ్రంగా అలసి పోతాయి. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. దీని కారణంగా వ్యాధులు త్వరగా ఎటాక్ చేసే అవకాశం ఉంది. శరీరంలో ఇన్ ఫెక్షన్ లతో పోరాడే సామర్థ్యం తగ్గి పోతుంది. అంతే కాకుండా ప్రోటీన్ ఉత్పత్తికి కూడా ఆటంకం కలుగుతుంది.
జ్ఞాపక శక్తి తగ్గి పోతుంది:
నిద్ర సరిగ్గా లేక పోతే ముందు మీ ఏకాగ్రత దెబ్బతింటుంది. ఏ పని మీదైనా ధ్యాస పెట్టలేరు. సరైన నిద్ర లేక పోవడం వల్ల మతి మరుపు కూడా వస్తుంది. చిన్న చిన్న విషయాలను త్వరగా మర్చిపోయే అవకశాం ఉంది. ఇదే కంటిన్యూ అయితే మాత్రం అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది. కనీనం ప్రతి రోజు 7 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.
మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది:
సరైన నిద్ర లేకపోతే మానసికంగా కృంగుబాటుకు గురవుతారు. అంతే కాకుండా మనస్ఫూర్తిగా ఉత్సాహంగా ఉండ లేదరు. ఆందోళన, ఒత్తిడి అనేవి ఎక్కువ అవుతుంది. మానసికంగా ఆరోగ్య సమస్యలను ఇది తీవ్ర తరం చేస్తుంది.
ఆకలిలో మార్పులు:
సరైన నిద్ర లేకపోతే శరీరంలో హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. దీంతో ఆకలి అనేది నియంత్రణలో ఉండదు. నిద్ర సరిగ్గా ఉండకపోతే లెప్టిన్, గ్రెలిన్ వంటి హార్మోన్లు నిద్ర ద్వారా ప్రభావితం అవుతాయి. దీని వల్ల అతిగా తినడం లేదా అనారోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ఈ హార్మోన్లు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఇవి కాస్తా బరువు పెరగడం, ఊబకాయం, డయాబెటీస్, రక్త పోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేందుకు కారణం అవుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








