AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Probiotic Foods: పేగుల్ని హెల్దీగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే.. ఒక్కసారి లుక్కేసేయండి!

మనం ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నాం కదా.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనుకుంటే పొరపాటే. శరీరంలో ఎన్నో భాగాలు ఉంటాయి. వాటికి తగిన విధంగా కూడా తీసుకునే ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. తిన్న ఆహారం జీర్ణం చేయడంలో పేగులు ముందుంటాయి. పేగుల్లో ప్రోబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటాయి. వీటి వలనే జీవక్రియ కూడా మెరుగు పడటం, రోగ నిరోధక శక్తి అనేది బలోపేతం అవుతాయి. అలాగే పేగుల్లో మంచి బ్యాక్టీరియానే కాదు..

Probiotic Foods: పేగుల్ని హెల్దీగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే.. ఒక్కసారి లుక్కేసేయండి!
Food
Chinni Enni
| Edited By: |

Updated on: Dec 14, 2023 | 11:20 AM

Share

మనం ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నాం కదా.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనుకుంటే పొరపాటే. శరీరంలో ఎన్నో భాగాలు ఉంటాయి. వాటికి తగిన విధంగా కూడా తీసుకునే ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. తిన్న ఆహారం జీర్ణం చేయడంలో పేగులు ముందుంటాయి. పేగుల్లో ప్రోబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటాయి. వీటి వలనే జీవక్రియ కూడా మెరుగు పడటం, రోగ నిరోధక శక్తి అనేది బలోపేతం అవుతాయి. అలాగే పేగుల్లో మంచి బ్యాక్టీరియానే కాదు.. చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇవి పెరిగితే పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అలా కాకుండా పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ప్రోబయోటిక్ ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చళ్లు:

సాధారణంగా పచ్చళ్లను ఎక్కువగా తీసుకోకూడదు అంటారు. కానీ.. ఈ పచ్చళ్లలో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి. నీటిలో ఊరబెట్టే వాటిలో ప్రోబయోటిక్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచింది. వీటిల్లో కేలరీలు తక్కువగా, విటమిన్లు, పోషకాలు మెండుగా ఉంటాయి. పికెల్డ్ కుకుంబర్ తినడం వల్ల విటమిన్ కే అందుతుంది. ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు.. రక్తం గడ్డ కట్టకుండా ఇది చూస్తుంది. అయితే వీటిల్లో ఎక్కువ శాతం ఉప్పు ఉంటుంది. కాబట్టి వీటిని కొద్ది మొత్తంలో తీసుకుంటేనే బెటర్.

చీజ్:

చీజ్ తినడం వల్ల కూడా పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా వరకు మనకు పులియ బెట్టిన చీజ్ లే లభ్యమవుతాయి. వీటిల్లో సమృద్ధిగా మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. చీజ్ తీసుకునేటప్పుడు లేబుల్ పై ‘యాక్టీవ్ కల్చర్స్’ అని ఉంటుంది. అంటే అందులో ప్రోబయోటిక్స్ ఉన్నట్లు అర్థం. అలాగే ఛద్దర్, కాటేజ్, మొజిరిల్లా చీజ్ వంటి వాటిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. కేవలం ప్రోబయోటిక్స్ మాత్రమే కాకుండా.. విటమిన్లు ఏ, బీ6, బీ 12, కే, కాల్షియం, అయోడిన్, జింక్, మెగ్నీషియం, పాస్పరస్ వంటివి కూడా లభ్యమవుతాయి.

ఇవి కూడా చదవండి

పెరుగు:

పెరుగు నేచురల్ గానే ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. పెరుగును అన్నంతో తిన్నా, మజ్జిగ రూపంలో తీసుకున్నా ప్రోబయోటిక్స్ పుష్కలంగా అందుతాయి. ఇవి శరీరంలో మంచి సూక్ష్మ జీవుల్ని అభివృద్ధి చేస్తాయి. అంతే కాకుండా ఎముకలు, గుండె కూడా ఆరోగ్యంగా ఉంటాయి. స్కిన్ కూడా మెరుస్తుంది. వెయిట్ లాస్ అవ్వడంలో, డయాబెటీస్ ను కంట్రోల్ చేయడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.