Ginger for Hair: అల్లంతో జుట్టును పెంచుకోవచ్చన్న విషయం మీకు తెలుసా!
జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి.. అందరికీ ఉంటుంది. కానీ ఇప్పుడున్న కాలంలో జుట్టు సమస్యలు ఎక్కువయ్యాయి. జుట్టు రాలడం, చుండ్రు, పల్చగా అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది మానసికంగా ఆందోళన కూడా చెందుతున్నారు. అల్లంతో కూడా మనం జుట్టును ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు..
Updated on: Dec 14, 2023 | 11:35 AM

వంటిల్లే వైద్యశాల అని ఊరికే చెప్పలేదు పెద్దలు. వంటింట్లో ఉండే వస్తువులను ఉపయోగించి ఎన్నో సమస్యలకు వైద్యం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే జుట్టుకు సంబంధించి ఎన్నో టిప్స్, సలహాలు, సూచనలు తెలుసుకున్నాం. అయినా ఇంట్లో ఉండే కొన్ని రకాల వాటితో జుట్టును ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి.. అందరికీ ఉంటుంది. కానీ ఇప్పుడున్న కాలంలో జుట్టు సమస్యలు ఎక్కువయ్యాయి. జుట్టు రాలడం, చుండ్రు, పల్చగా అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది మానసికంగా ఆందోళన కూడా చెందుతున్నారు.

అల్లంతో కూడా మనం జుట్టును ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తలకు రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. స్కాల్ఫ్ సర్క్యులేషన్ ను కూడా మెరుగు పరచడంలో అల్లం హెల్ప్ చేస్తుంది.

స్కాల్ఫ్ సర్య్కులేషన్ వల్ల.. కుదుళ్లు అనేవి బలంగా మారుతాయి. దీంతో జుట్టు పొడుగ్గా, బలంగా మారుతుంది. అల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్చ కొవ్వు ఆమ్లాలు జుట్టు తంతువులను బలోపేతం చేయడానికి, తేమను కూడా అందించడంలో ఉపయోగ పడతాయి. చుండ్రును కూడా తగ్గించడంలో అల్లం సహాయ పడుతుంది.

తాజా అల్లం రసాన్ని.. కొద్దిగా నీటిలో కలిపి స్ప్రే బాటిల్ లో వేసుకుని.. స్కాల్ఫ్, చివర్లకు స్ప్రే చేస్తే.. చివర్లు చీలిపోవడాన్ని, జుట్టును పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. మరో టిప్ ఏంటంటే.. అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి.. మిక్సీలో వేసి.. దాని నుంచి రసాన్ని తీయండి. ఈ రసాన్ని కొబ్బరి నూనె లేదా ఆలీవ్ ఆయిల్ లో కలిపండి. దీన్ని మాడు నుంచి చివర్ల వరకూ బాగా పట్టించండి. ఆ తర్వాత ఓ పది నిమిషాల పాటు స్మూత్ గా మర్దనా చేసుకోవాలి. ఇలా ఓ అరగంట తర్వాత ఉండి శుభ్రంగా తల వాష్ చేయాలి. ఇలా చేస్తే జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలూ పోతాయి.




