- Telugu News Photo Gallery These are the foods that prevent dry skin in winter season, check here is details
Foods for Skin: శీతా కాలంలో చర్మాన్ని పొడి బారకుండా చేసే ఫుడ్స్ ఇవే!
శీతా కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య చర్మం పొడి బారడం. దీంతో చాలా మంది బ్యూటీ కేర్ ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మాయిశ్చరైజర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చర్మ సంరక్షణ కోసం కేర్ తీసుకోవడం తప్పు కాదు. అయితే అది సహజంగా ఉంటే.. ఆరోగ్యానికి, చర్మానికి ఇంకా మంచిది. చర్మం పొడి బారకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకుంటే సరి పోతుంది. దీంతో మాయిశ్చ రైజర్స్ వాడే పని తప్పుతుంది. మరి ఆ ఫుడ్స్ ఏంటి? ఎలాంటి పోషకాలు..
Updated on: Dec 14, 2023 | 1:30 PM

శీతా కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య చర్మం పొడి బారడం. దీంతో చాలా మంది బ్యూటీ కేర్ ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మాయిశ్చరైజర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చర్మ సంరక్షణ కోసం కేర్ తీసుకోవడం తప్పు కాదు. అయితే అది సహజంగా ఉంటే.. ఆరోగ్యానికి, చర్మానికి ఇంకా మంచిది. చర్మం పొడి బారకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకుంటే సరి పోతుంది. దీంతో మాయిశ్చ రైజర్స్ వాడే పని తప్పుతుంది. మరి ఆ ఫుడ్స్ ఏంటి? ఎలాంటి పోషకాలు చర్మానికి అందించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

శీతాకాలంలో ప్రత్యేకంగా చిలగడ దుంపలు విరివిగా లభ్యమవుతూ ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన చర్మానికి రక్షణగా నిలుస్తుంది. ఇది వింటర్ లో చర్మానికి జరిగే డ్యామేజ్ ను దూరం చేస్తుంది.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. చేపల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. వింటర్ సీజన్ లో చేపలు తినడం వల్ల చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచింది. చేపలను డీప్ ఫ్రై చేసి తినడం కంటే.. స్టీమింగ్, గ్రిల్లింగ్, బేకింగ్ లేదా పులుసు ముక్కలు తిన్నా మంచిదే.

డ్రై ఫ్రూట్స్ లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కేవలం ఆరోగ్యమే కాకుండా.. చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచిది. నట్స్ లోని ముఖ్యమైన కొవ్వులు, ఆమ్లాలు చర్మ కణాలు దెబ్బతినకుండా చూస్తాయి. అంతే కాకుండా చర్మ కణాలను పునరుత్పత్తిని ప్రోత్సహిస్తాయి.

అలాగే బచ్చలి కూరలో కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు మెండుగా ఉంటాయి. బచ్చలి కూర విటమిన్లు, పోషకాలు, ఖనిజాలకు పవర్ హౌస్ అని చెప్పొచ్చు. ఇవి చర్మ కణాలను రిపేర్ చేస్తాయి.




