Legs Skin Care: ముఖంలానే కాళ్లు కూడా మెరవాలా.. లేట్ చేయకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

చాలా మంది ముఖంపై చూపించే శ్రద్ధ కాళ్లపై చూపించారు. ముఖం మెరుస్తూ కనిపించినా.. కాళ్లు మాత్రం ఆకర్షణీయంగా కనిపించవు. కాళ్లపై సరైన విధంగా జాగ్రత్త చూపించకపోతే.. కాళ్లు, పాదాలు డ్రైగా మారి రంగు కూడా మారతాయి. ఈ సమస్యనూ దూరం చేసుకుని, ముఖంతో పాటు కాళ్లు కూడా మెరవాలంటే ఖచ్చితంగా కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవ్వాలి. ఇవి నిజంగానే మీకు హెల్ప్ చేస్తాయి. చర్మం యంగ్ గా ఉండి మెరవాలంటే మృత కణాలను తొలగించు కోవాలి. అందు కోసం పాదాలను ఎక్స్ ఫోలియేషన్ చేయాలి. అంటే ఏదో అనుకునేరు. ఇంట్లో ఉండే ఐటెమ్స్ తో మీకు తెలిసిన చిట్కాలతో..

Legs Skin Care: ముఖంలానే కాళ్లు కూడా మెరవాలా.. లేట్ చేయకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Skin Care
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 25, 2023 | 9:35 PM

చాలా మంది ముఖంపై చూపించే శ్రద్ధ కాళ్లపై చూపించారు. ముఖం మెరుస్తూ కనిపించినా.. కాళ్లు మాత్రం ఆకర్షణీయంగా కనిపించవు. కాళ్లపై సరైన విధంగా జాగ్రత్త చూపించకపోతే.. కాళ్లు, పాదాలు డ్రైగా మారి రంగు కూడా మారతాయి. ఈ సమస్యనూ దూరం చేసుకుని, ముఖంతో పాటు కాళ్లు కూడా మెరవాలంటే ఖచ్చితంగా కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవ్వాలి. ఇవి నిజంగానే మీకు హెల్ప్ చేస్తాయి. మరి లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం.

ఎక్స్ ఫోలియేషన్ చేయాలి:

చర్మం యంగ్ గా ఉండి మెరవాలంటే మృత కణాలను తొలగించు కోవాలి. అందు కోసం పాదాలను ఎక్స్ ఫోలియేషన్ చేయాలి. అంటే ఏదో అనుకునేరు. ఇంట్లో ఉండే ఐటెమ్స్ తో మీకు తెలిసిన చిట్కాలతో వారానికి రెండు సార్లు కాళ్లను, పాదాలను స్క్రబ్ చేస్తే సరి పోతుంది. స్క్రబ్బింగ్ కూడా మరీ ఎక్కువగా చేయ కూడదు. దీని వల్ల చర్మం దెబ్బతింటుంది. ఓ ఐదు నుంచి పది నిమిషాలు చేస్తే చాలు. దీంతో చర్మం మెరుస్తూ, స్మూత్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మాయిశ్చ రైజర్ అప్లై చేయాలి:

చాలా మంది ముఖం ఆ తర్వాత చేతులకు మాయిశ్చ రైజర్ అప్లై చేస్తారు కానీ కాళ్ల విషయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోరు. స్నానం చేశాక ముఖం, చేతులతో పాటు కాళ్లకు కూడా మాయిశ్చరైజర్ రాయాలి. దీని వల్ల మీ కాళ్లు డల్ గా, పొడి బారకుండా ఉంటాయి. దీని వల్ల కాళ్లు సాఫ్ట్ గా, కాంతి వంతంగా తయారవుతాయి. స్నానం చేయకముందు కొబ్బరి నూనెతో మసాజ్ కూడా చేసుకోవచ్చు.

వాక్సింగ్ చేయాలి:

వాక్సింగ్ చేసుకోవడం వల్ల కాళ్లపై ఉండే వెంట్రుకలు, దుమ్ము, ధూళి వంటివి పోతాయి. కాళ్లు మెరుగ్గా కనిపిస్తాయి. వాక్సింగ్ అలవాటు లేని వాళ్లు షేవింగ్ రేజర్ ను ఉపయోగించవచ్చు. షేవింగ్ తర్వాత తప్పకుండా అలోవెరా జెల్ అనేది వాడాలి. దీని వల్ల కాళ్లు మరింత అందంగా కనిపిస్తాయి. ఇలా నెలకు ఒకసారైనా షేవింగ్ రేజర్ వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి.

నీళ్లు – వర్క్ అవుట్స్:

పైన చెప్పిన చిట్కాలతో పాటు నీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నీటిని తాగడం వల్ల శరీరం అనేది హైడ్రేట్ గా ఉంటుంది. చర్మం మెరుస్తుంది. అలాగే వర్క్ అవుట్స్ చేయడం వల్ల రక్త ప్రసరణ జరిగి.. చర్మం లోపల నుంచి అందంగా కనిపిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్స్ ఉన్న ఫుడ్ ని తీసుకోవాలి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.