Sleeping Precautions: చటుక్కున నిద్రలోకి జారు కోవాలా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే!

కొంత మందికి ఊరికే నిద్ర వస్తుంది. మరి కొంత మందికి నిద్ర పోదామంటే అస్సలు నిద్ర రాదు. ఎంత పడుకుందాం అని ట్రై చేస్తున్నా కంటి మీదకు కునుకు అన్నది రాదు. రకరకాల ఆలోచనలు చుట్టుముట్టేస్తాయి. ఈ ఆలోచనలతోనే సగం రాత్రి గడిస్తుంది. అలా అర్థ రాత్రి నిద్రలోకి జారుకుంటారు. ఉదయం లేవాలంటే.. చాలా కష్టంగా ఉంటుంది. మెదడు యాక్టీవ్ గా అవ్వడం వల్ల ఈ నిద్ర అనేది పట్టదు. కాబట్టి బ్రెయిన్ ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే సరి..

Sleeping Precautions: చటుక్కున నిద్రలోకి జారు కోవాలా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే!
Sleep
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 25, 2023 | 10:35 PM

కొంత మందికి ఊరికే నిద్ర వస్తుంది. మరి కొంత మందికి నిద్ర పోదామంటే అస్సలు నిద్ర రాదు. ఎంత పడుకుందాం అని ట్రై చేస్తున్నా కంటి మీదకు కునుకు అన్నది రాదు. రకరకాల ఆలోచనలు చుట్టుముట్టేస్తాయి. ఈ ఆలోచనలతోనే సగం రాత్రి గడిస్తుంది. అలా అర్థ రాత్రి నిద్రలోకి జారుకుంటారు. ఉదయం లేవాలంటే.. చాలా కష్టంగా ఉంటుంది. మెదడు యాక్టీవ్ గా అవ్వడం వల్ల ఈ నిద్ర అనేది పట్టదు. కాబట్టి బ్రెయిన్ ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే సరి పోతుంది. మరి అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దీర్ఘమైన శ్వాస:

ఎప్పుడైనా నిద్ర పట్టలేనప్పుడు నిద్ర పోవడానికి గంట ముందు నుంచి దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. శ్వాసపై ధ్యాస ఉంచాలి. లోపలికి బయటకు తీస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రక్త పోటు, గుండె కొట్టుకోవడం అనేది నియంత్రణలోకి వస్తాయి. ఊపిరి గట్టిగా బిగబెట్టి వదులుతూ ఉండాలి. దీని వల్ల మెదడుకు రిలాక్సేషన్ దొరుకుతుంది.

ఇవి కూడా చదవండి

ఫోన్స్ ని దూరంగా ఉంచండి:

చాలా మంది నిద్ర పోవాలి అని తెలిసి కూడా అర్థరాత్రులు అయ్యే వరకు స్క్రీనింగ్ చూస్తూ ఉంటారు. కాబట్టి టీవీ, ల్యాప్ ట్యాప్స్, ఫోన్స్ వంటి వాటికి ముఖ్యంగా వీటికి దూరంగా ఉండాలి.

ధ్యానం:

బ్రెయిన్ రిలీఫ్ గా ఉంటేనే నిద్ర అనేది పడుతుంది. కాబట్టి పడుకునే ముందు ధ్యానం చేయడం వల్ల కూడా ప్రశాంతత లభిస్తుంది. దీన్ని రోజూ చేయడం వల్ల కేవలం నిద్ర మాత్రమే కాదు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు.

మసాజ్:

నిద్ర పోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం.. ఫేస్, మెడ దగ్గర కండరాల వద్ద సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ కండరాలు మెదడుకు లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మసాజ్ చేయడం వల్ల ఆ కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇలా చేయడం వల్ల మీకు త్వరగా నిద్ర పడుతుంది.

ఆలోచనలకు దూరంగా ఉండాలి:

చాలా మందికి బెడ్ మీదకు రాగానే ఎక్కడి లేని ఆలోచనలు అన్నీ గుర్తుకు వచ్చేస్తాయి. వారి పడిన అవమానాలు, బాధలు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు అన్నీ గుర్తొస్తాయి. ఇలాంటి ఆలోచనల వల్ల నిద్ర అనేది త్వరగా రాదు. కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండేందుకు ట్రై చేయండి. మీ మూడ్ ని డైవర్ట్ చేసుకోండి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.