Peanuts Benefits: వేరు శనగలను నాన బెట్టి తింటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు!

మనం నిత్యం ఆహారంలో తీసుకునే వాటిల్లో వేరుశనగ గుళ్లు కూడా ఒకటి. వీటిని పల్లీలు అని కూడా అంటారు. వేరు శనగలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి రోజూ గుప్పెడు వేరు శనగ తింటే ఎన్నో లభాలు ఉన్నాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. దీన్ని సామాన్యుని జీడి పప్పుగా కూడా పిలుస్తారు. పల్లీల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కాపర్, ఐరన్, జింక్, కాల్షియం, సెలీనియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ప్రతి రోజూ వీటిని తీసుకుంటే ఆరోగ్యం, చర్మం, జుట్టుకి చాలా మంచిది. అయితే వీటిని నానబెట్టి తింటే మరిన్ని పోషకాలు..

Peanuts Benefits: వేరు శనగలను నాన బెట్టి తింటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు!
Soaked Peanuts
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 24, 2023 | 10:35 PM

మనం నిత్యం ఆహారంలో తీసుకునే వాటిల్లో వేరుశనగ గుళ్లు కూడా ఒకటి. వీటిని పల్లీలు అని కూడా అంటారు. వేరు శనగలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి రోజూ గుప్పెడు వేరు శనగ తింటే ఎన్నో లభాలు ఉన్నాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. దీన్ని సామాన్యుని జీడి పప్పుగా కూడా పిలుస్తారు. పల్లీల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కాపర్, ఐరన్, జింక్, కాల్షియం, సెలీనియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ప్రతి రోజూ వీటిని తీసుకుంటే ఆరోగ్యం, చర్మం, జుట్టుకి చాలా మంచిది. అయితే వీటిని నానబెట్టి తింటే మరిన్ని పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది:

నాన బెట్టిన వేరు శనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి.. ప్రాణాంతక కణాలను నివారిస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు అభివృద్ధి కాకుండా చూస్తాయి. పల్లీల్లో ఫైటో స్టెరాల్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

వెన్ను నొప్పి తగ్గిస్తుంది:

పల్లీల్లో ఉండే పోషకాలు వెన్ను నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. డెస్క్ జాబ్స్ చేసే వారికి ఎక్కువగా వెన్ను నొప్పు వేధిస్తుంది. ఇలాంటి వారు నానబెట్టిన వెరు శనగలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నాన బెట్టిన వేరు శనగలతో బెల్లం కూడా కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తుంది:

జ్ఞాపక శక్తిని, కంటి చూపును మెరుగు పరచడంలో వెరు శనగలో ఉండే విటమిన్లు సహాయ పడతాయి. చిన్న పిల్లలు, పెద్దల్లో వచ్చే మతి మరుపును నియంత్రించి, అల్జీ మర్స్ రాకుండా చూస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని కూడా తగ్గిస్తాయి.

స్కిన్, హెయిర్ ఆరోగ్యానికి:

జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా వేరు శనగలు ముఖ్య పాత్ర వహిస్తాయి. పల్లీల్లో మంచి కొవ్వులు, విటమిన్లు సి, ఇలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది. అలాగే చర్మ సమస్యలు తగ్గి, మెరుపును సంతరించుకుంటుంది.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:

నానబెట్టిన వేరు శనగలు తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా దీర్ఘకాలంలో వచ్చే గుండె పోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. జీవ క్రియను కూడా మెరుగు పరుస్తుంది. దీంతో గ్యాస్, మలబద్ధకం, అజీర్తి సమస్యలు ఉండవు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.