AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Growth Tips: ఈ ఆకుల ఆయిల్ రాసినా, స్ప్రే చేసినా జుట్టు సమస్యలు మాయం!

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా ఉండాలని కోరుకోని వారుండరు. ప్రస్తుత కాలంలో జుట్టు అనేది విపరీతంగా రాలిపోతుంది. హెయిర్ తోనే అదనపు అందం యాడ్ అవుతుంది. ఇది కాస్తా మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. జుట్టు రాలడానికి ఒక్కటేంటి.. చాలా కారణాలు ఉంటాయి. నిద్ర లేమి సమస్యలు, సరైన ఆహారం తీసుకోకపోవడం, మారిన లైఫ్ స్టైల్ విధానం, కొన్ని రకాల మందుల వాడకం, హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి. అయితే జుట్టుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ ఆకు ఆయిల్ ని వాడితే మాత్రం..

Hair Growth Tips: ఈ ఆకుల ఆయిల్ రాసినా, స్ప్రే చేసినా జుట్టు సమస్యలు మాయం!
Rosemary
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 24, 2023 | 9:35 PM

Share

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా ఉండాలని కోరుకోని వారుండరు. ప్రస్తుత కాలంలో జుట్టు అనేది విపరీతంగా రాలిపోతుంది. హెయిర్ తోనే అదనపు అందం యాడ్ అవుతుంది. ఇది కాస్తా మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. జుట్టు రాలడానికి ఒక్కటేంటి.. చాలా కారణాలు ఉంటాయి. నిద్ర లేమి సమస్యలు, సరైన ఆహారం తీసుకోకపోవడం, మారిన లైఫ్ స్టైల్ విధానం, కొన్ని రకాల మందుల వాడకం, హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి. అయితే జుట్టుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ ఆకు ఆయిల్ ని వాడితే మాత్రం.. అవన్నీ మాయం అవుతాయి. అదేంటి అనుకుంటున్నారా.. రోజ్మేరీ. ఈ మొక్కలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

రోజ్మెరీ ఆయిల్ ఈ మధ్య ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆయిల్ లో కార్నోసిక్ యాసిడ్ అనే పదార్థాం ఉంటుంది. ఈ పదార్థం.. చనిపోయిన కణాలను మళ్లీ పునరుజ్జీవింప చేస్తుంది. కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఈ రోజ్మేరీ ఆయిల్ చాలా మంచింది. ఆయుర్వేదంలో కూడా రోజ్మేరీ ఆయిల్ ని వివిధ రకాల సమస్యలకు ఔషధంలా ఉపయోగిస్తారు. జుట్టు బలంగా, దృఢంగా ఉంచడంలో ఈ ఆయిల్ బాగా సహాయ పడుతుంది. మరి ఈ ఆయిల్ ని ఎలా వాడాలి? ఎలా రాయడం వల్ల జుట్టు సమస్యల్ని తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలా వాడాలంటే:

ఇవి కూడా చదవండి

రోజ్మేరీ ఆయిల్ ఇప్పుడు మార్కెట్లో కూడా లభ్యమవుతుంది. ఒక స్పూన్ కొబ్బరి నూనెలో 5, 6 చుక్కల రోజ్మేరీ ఆయిల్ ని కలపాలి. దీన్ని డబుల్ బాయిల్ మోడ్ లో వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కిన ఆయిల్ గోరు వెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించాలి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా ముందు రాత్రి కానీ లేదా హెడ్ బాత్ చేసే గంట ముందు కూడా రాసుకోవచ్చు.

ఈ ఆయిల్ ప్రయోజనాలు:

ఈ హెయిర్ ఆయిల్ రాయడం వల్ల జుట్టు రాలడం, తెల్ల బడటం, ఇన్ ఫెక్షన్స్, చుండ్రు వంటి సమస్యలు తగ్గి పోతాయి. ఈ ఆయిల్ రాసిన కొద్ది రోజుల్లోనే జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది.

స్ప్రే రూపంలో కూడా ఉపయోగించుకోవచ్చు:

పైన చెప్పిన విధంగా ఆయిల్ రాయడం ఇబ్బందిగా ఉన్న వారు హెయిర్ స్ప్రే కూడా చేసుకోవచ్చు. కొన్ని రోజ్మేరీ ఆకులు, పుదీనా ఆకులను ఓ గ్లాస్ వాటర్ లో బాగా మరిగించాలి. ఇలా మరిగిన నీరు.. గోరు వెచ్చగా ఉన్నా లేక చల్లారిన తర్వాత ఓ బాటిల్ లో వేసి తలకు స్ప్రే చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ మాయం అయిపోతాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు