Home Remedies for Tonsils: టాన్సిల్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఇంటి టిప్స్ పాటిస్తే ఖర్చు లేకుండా తగ్గించు కోవచ్చు!
టాన్సిల్ ఉన్న వారు చలి కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. శీతా కాలంలో టాన్సిల్స్ ఇన్ ఫెక్షన్ కు గురవుతాయి. వీటి వల్ల గొంతులో వాపుతో పాటు నొప్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహారం తీసుకునే క్రమంలో, ఆఖరికి మంచినీళ్లు తాగినప్పుడు మింగడానికి నొప్పిగా ఉంటాయి. దీంతో ఆహారాన్ని తీసుకోవాలంటే కష్టం ఉంటుంది. చలి కాలంలో ఇలాంటి ఇబ్బందులు అనేవి సర్వ సాధారణం. ఈ బాధను తట్టుకోలేక కొంత మంది వైద్యులను సంప్రదిస్తే.. మరి కొంత మంది ట్యాబ్లెట్స్ తో ఉపశమనం పొందుతారు. కాని మెడికల్ షాపుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే..
టాన్సిల్ ఉన్న వారు చలి కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. శీతా కాలంలో టాన్సిల్స్ ఇన్ ఫెక్షన్ కు గురవుతాయి. వీటి వల్ల గొంతులో వాపుతో పాటు నొప్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆహారం తీసుకునే క్రమంలో, ఆఖరికి మంచినీళ్లు తాగినప్పుడు మింగడానికి నొప్పిగా ఉంటాయి. దీంతో ఆహారాన్ని తీసుకోవాలంటే కష్టం ఉంటుంది. చలి కాలంలో ఇలాంటి ఇబ్బందులు అనేవి సర్వ సాధారణం. ఈ బాధను తట్టుకోలేక కొంత మంది వైద్యులను సంప్రదిస్తే.. మరి కొంత మంది ట్యాబ్లెట్స్ తో ఉపశమనం పొందుతారు. కాని మెడికల్ షాపుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఉండే కొన్ని రకాల టిప్స్ ని పాటిస్తే.. టాన్సిల్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
తేనె – పసుపు పాలు:
తేనె, పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే పాలు తాగడం వల్ల తక్షణ ఎనర్జీ లభిస్తుంది. కాబట్టి మీరు టాన్సిల్ తో ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం రోజుకు రెండు సార్లు తేనె, పసుపు కలిపిన పాలు తాగడం వల్ల దీని నుంచి రిలీఫ్ పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
లవంగాలు:
లవంగాలు కూడా మన వంట గదిలో ఉంటాయి. వీటిల్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి లవంగాలు కూడా గొంతు నొప్పి, టాన్సిల్స్ నొప్పిని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. లవంగాలు నమిలినా లేదా బుగ్గన పెట్టుకుని చప్పరించినా.. టాన్సిల్స్ పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. వీటి వలన నోటి దుర్వాసన కూడా పోతుంది.
ఉప్పు వాటర్:
టాన్సిల్స్ బాధిస్తున్నప్పుడు ఉప్పు నీటితో గొంతు దగ్గర పుక్కిలించడం వల్ల మంచి రిలీఫ్ నెస్ లభిస్తుంది. నొప్పి తీవ్రత కూడా తగ్గుతుంది. గొంతు నొప్పితో బాధ పడే వారు కూడా ఉప్పు నీటితో పుక్కిలించవచ్చు. ఇలా ఉప్పు నీటిని పుక్కిలించడం వల్ల వాపు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
తులసి ఆకులు:
సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఎలాంటి సమస్యలకైనా తులసి ఆకులతో చెక్ పెట్టొచ్చు. టాన్సిల్స్ నొప్పితో బాధ పడేవారు తులసి ఆకులని నమలడం వల్ల ఆ నొప్పి, వాపు తీవ్రత తగ్గుతాయి. దీంతో పాటు జలుబు, దగ్గు వంటివి ఉన్నా తగ్గుముఖం పడతాయి. అలాగే తులసి ఆకులతో చేసిన కషాయాన్ని తాగినా పర్వాలేదు.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.