Restaurant Style Aloo 65: రెస్టారెంట్ స్టైల్ ఆలూ 65ని ఇలా చేయండి.. సూపర్ టేస్టీగా ఉంటాయి!
బంగాళా దుంపలతో ఒక్కటేంటి చేయలేని వంటలు ఉండవు. బంగాళ దుంపలతో కర్రీలు, ఫ్రై, స్నాక్స్ ఇలా ఎన్నో చేసుకోవచ్చు. స్నాక్స్ లో అయితే లెక్కలేనన్ని వెరైటీలు ఉంటాయి. అలాగే బంగాళ దుంపతో చేసే స్నాక్స్ కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఆలూతో ఎలాంటి వంటలనైనా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఈ క్రమంలో రెస్టారెంట్ లో నాన్ వెజ్ తినని.. విజ్ ప్రియుల కోసం ఎన్నో రకాలు తయారు చేస్తారు. వాటిలో ఆలూ 65 కూడా ఒకటి. ఆలూ 65 చిన్న పిల్లలకు ఎంతో బాగా నచ్చుతుంది. ఒక్కటి కూడా విడిచి పెట్టకుండా..
బంగాళా దుంపలతో ఒక్కటేంటి చేయలేని వంటలు ఉండవు. బంగాళ దుంపలతో కర్రీలు, ఫ్రై, స్నాక్స్ ఇలా ఎన్నో చేసుకోవచ్చు. స్నాక్స్ లో అయితే లెక్కలేనన్ని వెరైటీలు ఉంటాయి. అలాగే బంగాళ దుంపతో చేసే స్నాక్స్ కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఆలూతో ఎలాంటి వంటలనైనా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఈ క్రమంలో రెస్టారెంట్ లో నాన్ వెజ్ తినని.. విజ్ ప్రియుల కోసం ఎన్నో రకాలు తయారు చేస్తారు. వాటిలో ఆలూ 65 కూడా ఒకటి. ఆలూ 65 చిన్న పిల్లలకు ఎంతో బాగా నచ్చుతుంది. ఒక్కటి కూడా విడిచి పెట్టకుండా తినేస్తారు. మరి ఈ ఆలూ 65ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు:
బంగాళ దుంపలు, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, నూనె, కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, కరి వేపాకు, కొత్తి మీర, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, టమాటా సాస్చ చాల్ మసాలా, పచ్చి మిర్చి.
ఆలూ 65 తయారీ విధానం:
ముందుగా బంగాళ దుంపలకు ఉన్న పొట్టు తీసేసి, తురుము కోవాలి. ఈ తురుమును నీటితో శుభ్రంగా కడగాలి. శుభ్రం చేసిన ఆలూ తురుమను ఒక లోతైన గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కార్న్ ఫ్లోర్, మైదా పిండి, కారం, ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపు కోవాలి. ఈలోపు ఒక కడాయి తీసుకుని.. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు అవసరం అయినన్ని నీళ్లు వేసుకుంటూ బంగాళ దుంపల తురుమును బాగా కలుపుకోవాలి. వీటిని ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టు కోవాలి.
ఆయిల్ బాగా వేడెక్కాక.. మీడియం మంట పెట్టి.. ఈ బంగాళ దుంప ఉండలను వేసి ఎర్రగా వేయించు కోవాలి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, నాలుగు వెల్లి రెబ్బలు వేసి బాగా వేయించు కోవాలి. ఇవి వేగాక పచ్చి మిర్చి, కరివేపాకు వేసి మరోసారి వేయించాలి.
తర్వాత ఆలూ ఉండలను, టమాటా సాస్ వేసి బాగా కలపాలి. కొద్ది సేపు ఆగాక.. చాట్ మసాలా వేసుకుని అంతా కలిసేశా కలుపు కోవాలి. మరో కొద్ది సేపు బాగా వేయించుకున్నాక.. ఓ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ 65 సిద్ధం. వీటిని వీకెండ్స్ లో, ఏదైనా స్పెషల్ డేస్ లో చేసుకుని తింటే బావుంటుంది.